వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయ్యా టిక్ టాక్ మళ్లీ వచ్చేసింది భయ్యా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ మళ్లీ వచ్చేసింది. ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చాయి. మద్రాస్ హైకోర్టు నిషేధం నేపథ్యంలో 15 రోజులుగా ఈ యాప్ అందుబాటులో లేకుండా పోయింది. గతవారం కొన్ని షరతులతో మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తివేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల అనంతరం టిక్ టాక్ యాప్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు.

యూజర్లకు గుడ్‌న్యూస్ : టిక్ టాక్ యాప్‌ బ్యాన్ ఎత్తివేతయూజర్లకు గుడ్‌న్యూస్ : టిక్ టాక్ యాప్‌ బ్యాన్ ఎత్తివేత

తమలోని క్రియేటవిటీని బయటి ప్రపంచానికి పరిచయం చేసేందుకు టిక్ టాక్ ఉపయోగపడింది. అయితే ఈ యాప్ యువతను తప్పుదారి పట్టిస్తోందని, ఆశ్లీలతను పెంచడంతో పాటు విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ మధురైకి చెందిన ముత్తు కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం టిక్ టాక్‌ను బ్యాన్ చేస్తూ తీర్పు చెప్పింది.

TikTok pops back on Google Play Store, Apple App Store

మద్రాస్ హైకోర్టు తీర్పుపై టిక్ టాక్ ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే నిషేధం ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం తొలుత నిరాకరించింది. అనంతరం మద్రాస్ హైకోర్టు నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోతే బ్యాన్ ఎత్తివేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మధురై ధర్మాసనం గతవారం కొన్ని షరతులు విధిస్తూ టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేసింది.

English summary
After being removed from the Google Play Store and Apple App Store for nearly half a month, media sharing app TikTok is back on both platforms. The app can now be downloaded and used without any restrictions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X