వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ తీర్పు: ఇటు వీరభద్రుడి విక్రమాదిత్య.. అటు నడ్డా వర్సెస్ ‘అనురాగ్’ ధుమాల్

కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ ఎన్నికల పోరాటం జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ వారసులను అందలం ఎక్కించేందుకు వీలుగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాయకుల వారసుల రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీఎం వీరభద్ర సింగ్ 83 ఏళ్ల వయస్సుకు చేరుకోవడంతో తన కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు 73 వసంతాలు దాటిన ప్రతిపక్ష బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్‌ పార్టీలో తన విరోధి - కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు వ్యతిరేకంగా ఎంపీ తనయుడు అనురాగ్ ఠాకూర్‌ను తన రాజకీయ వారసుడిగా బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
68 అసెంబ్లీ స్థానాలు గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ముఖాముఖీ పోరు జరుగనున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇరు పార్టీల నాయకుల వారసుల రాజకీయ అరంగ్రేటానికి దారి సుగమవుతున్నది.

 ఐదేళ్లుగా సర్కార్ విధానాల్లో విక్రమాదిత్య ఇలా

ఐదేళ్లుగా సర్కార్ విధానాల్లో విక్రమాదిత్య ఇలా

సహజంగానే హిమాచల్ ప్రదేశ్ వాసులంతా నేతల తదుపరి వారసుల కోసం చర్చిస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. కానీ సహజంగానే సీఎం వీరభద్ర సింగ్‌కు, సీఎం అభ్యర్థిని ప్రకటించని బీజేపీకి మధ్య ముఖాముఖీ పోటీ జరుగనున్నదని చెప్పారు. వీరభద్ర సింగ్ తన తనయుడిగా విక్రమాదిత్య సింగ్ (28)ను ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిమ్లా రూరల్ స్థానం నుంచి అభ్యర్థిగా, తన రాజకీయ వారసుడిగా ప్రకటించనున్నారు. గత ఐదేళ్లుగా హిమాచల్ ప్రదేశ్ యువజన కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చిన విక్రమాదిత్య సింగ్.. ప్రభుత్వ కీలక విధాన నిర్ణయాల్లోనూ భాగస్వామి అయ్యారు.

 అసమ్మతి అణచివేతకు ఇలా హిమాచల్ సీఎం చర్యలు

అసమ్మతి అణచివేతకు ఇలా హిమాచల్ సీఎం చర్యలు

ఏడోసారి హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పని చేస్తున్న వీరభద్ర సింగ్ తన కుమారుడ్ని.. కాంగ్రెస్ పార్టీకి తదుపరి నాయకుడిగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా తన మద్దతు దారులకే ఎక్కువగా టిక్కెట్లు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు గత ఐదేళ్లుగా అధికార కాంగ్రెస్ పార్టీలో తన కుమారుడికి వ్యతిరేకంగా వచ్చిన అసమ్మతిని అణగదొక్కేందుకు అవసరమైన ప్రయత్నాలు చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 వీరభద్రుడిపై అవినీతి ఆరోపణలు ఇలా

వీరభద్రుడిపై అవినీతి ఆరోపణలు ఇలా

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఒకటి. గత మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్‌లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నది. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ చెరోసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సీఎం వీరభద్ర సింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై ద్రుష్టి సారించింది. గత జూలైలో 16 ఏళ్ల మైనర్ పై లైంగిక దాడి, హత్యతో వీరభద్ర సింగ్ ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి.

 తొలిదశలో అనురాగ్ రంగ ప్రవేశాన్ని వ్యతిరేకించిన ధుమాల్

తొలిదశలో అనురాగ్ రంగ ప్రవేశాన్ని వ్యతిరేకించిన ధుమాల్

హమీర్‌పూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు అనురాగ్ ఠాకూర్ ఆలస్యంగా బీజేపీ తరఫున రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని సంకల్పించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇటీవల బీసీసీఐ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్‌ను తన రాజకీయ వారసుడిగా తొలి నుంచి ప్రేమ్ కుమార్ ధుమాల్ వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన వ్యతిరేకి.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఎదుర్కొనేందుకు ప్రేమ్ కుమార్ ధుమాల్‌‪ తన కుమారుడ్ని తన రాజకీయ వారసుడిగా ముందుకు తేవాలని ప్రయత్నిస్తున్నారు.

 ఖట్టర్ మాదిరిగా కొత్త నేతను ప్రకటించే అవకాశం

ఖట్టర్ మాదిరిగా కొత్త నేతను ప్రకటించే అవకాశం

ఒకవేళ బీజేపీ గెలుపొందినా ప్రేమ్ కుమార్ ధుమాల్ సీఎం అయ్యే అవకాశాలు లేవని కమలనాథులే చెప్తున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన అనధికార 75 ఏళ్ల గడువును ప్రేమ్ కుమార్ ధుమాల్ మరో రెండేళ్లలో చేరుకోనుండటమే దీనికి కారణమని అంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నిత్యం ప్రకటించి అభివ్రుద్ధి ఏజెండాతోపాటు ప్రచార బరిలో సీఎం అభ్యర్థులుగా అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ నేతలు చెప్తున్న దాని ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ గెలుపొందితే హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ వంటి మరో డార్క్ హార్స్ వంటి నేతను సీఎంగా నియమించొచ్చని సమాచారం.

English summary
Experts say the election is all about who will pick up the party mantle next as Congress’ Virbhadra Singh is in his 80s while BJP’s Prem Kumar Dhumal is in his 70s. The election to the 68-member Himachal Pradesh assembly will be a keenly fought contest between the ruling Congress and the Opposition BJP but it will be watched closely for another reason: The emergence of the next generation of leaders on both sides of the political divide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X