వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామమందిర నిర్మాణం చేపట్టేందుకు సమయం ఆసన్నమైందన్న స్వామి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణ అంశం ఎప్పుడూ వివాదాస్పదంగానే నిలుస్తోంది. ఈ అంశాన్ని లేవనెత్తారంటే దాని చుట్టూ ఏదో వివాదం అల్లుకునే ఉంటుందనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి మరోసారి అయోధ్య రామమందిర నిర్మాణం లేవనెత్తారు. ఈసారి నేరుగా ప్రధాని మోడీకే తన ప్రశ్నను సంధించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మోడీ సర్కార్ చొరవ చూపాలని సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఇక జాప్యం చేయకూడదని చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి... రామమందిర నిర్మాణం చేపట్టేందుకు సమయం ఆసన్నమైందని వీహెచ్‌పీ కానీ రామజన్మభూమి న్యాస్ సమితి సహాయంతో నిర్మాణం చేపట్టాలని ఆయన అన్నారు.

Time has come for Modi sarkar to constuct Ram Mandir,tweets Subramanian swamy

మొత్తం 67.703 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వానికి చెందినదని గుర్తు చేసిన సుబ్రహ్మణ్యన్ స్వామి... కేసు సుప్రీం కోర్టులో ఉందని చెప్పారు.అయినప్పటికీ కేసు ఎవరు గెలిచినా వారికి డబ్బులు మాత్రమే చెల్లించాలని భూమి కాదని స్వామి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చేది లేదు కాబట్టి రామమందిర నిర్మాణం ఆ భూమిలో నిర్మించొచ్చని చెప్పారు స్వామి.

అంతకుముందు మే 31న ప్రధాని మోడీకి లేఖ రాశారు స్వామి. ప్రజాప్రయోజనం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎవరి భూమినైనా తీసుకోవచ్చని అదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాదు ఈ కేసులో ఉన్నవారికందరికీ పరిహారం చెల్లిస్తామని చెప్పాల్సిందిగా స్వామి మోడీకి సూచించారు.

నాటి పీవీ నరసింహారావు సర్కారు భూమిని జాతీయం చేసిందని వాదించారు సుబ్రహ్మణ్య స్వామి. వివాదంలో ఉన్న భూమితో పాటు వివాదంలో లేని భూమిని కూడా జాతీయం చేశారని ఆరోపించారు.దీంతో పరిహారం ఇవ్వడంపై మాత్రమే సుప్రీంకోర్టు దృష్టి సారించాలని అన్నారు. 1993 94లో చేసిన చట్టం ప్రకారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించిందని గుర్తు చేశారు.

దీనికి కేసుతో సంబంధం ఉన్నవారంతా పరిహారంను అంగీకరించారని ఒక్క రామజన్మభూమి న్యాస్ సమితి మాత్రం అంగీకరించలేదని గుర్తు చేశారు. ఇక రామజన్మభూమి వివాదంలో పరిహారం చెల్లిస్తామని మాత్రమే సుప్రీంకోర్టుకు తెలపాలని మోడీ సర్కార్‌కు సూచించారు స్వామి. ఇక కేసుతో సంబంధం ఉన్న రెండు పార్టీలు తాము వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే ఇద్దరికీ పరిహారం ఇచ్చేలా అడుగులు వేయాలని కేంద్రానికి సూచించారు స్వామి.

English summary
Raking up the contentious issue of Ram Mandir, senior Bharatiya Janata Party (BJP) leader Subramanian Swamy on Thursday asked the Narendra Modi-led government to commence construction of Ram Temple at Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X