వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్ మ్యాగజైన్ ఇష్యూ : ఆ రచయితది పాకిస్థాన్ ఎజెండా : బీజేపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : టైమ్ మ్యాగజైన్ పై ప్రధాని మోడీ కవర్ పేజీ ప్రచురించి, డివైడర్ ఇన్ చీఫ్ అని హెడ్ లైన్ పెట్టడంపై బీజేపీ స్పందించింది. ఆ హెడ్ లైన్ పెట్టిన జర్నలిస్టు తసీర్ పాకిస్థాన్ ఎజెండా తీసుకున్నాడని విమర్శించింది. అంతేకాదు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన రీ ట్వీట్ ను తప్పుపట్టారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా.

సంక్షేమమే పరమావధి ..

సంక్షేమమే పరమావధి ..

2014లో కూడా కొన్ని మ్యాగజైన్లు మోడీ గెలవరని విమర్శించాయని పాట్రా పేర్కొన్నారు. మోదీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. దేశంలో సంస్కరణలు అమల్లోకి వచ్చి ముందుడుగు దిశగా పయనిస్తోందని తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ నేత సిద్దూ చేసిన జాత్యాంహకార, సెక్సియిస్ట్ ఆరోపణలను కూడా పాత్రా ఖండించారు.

అది వారి పద్ధతి

అది వారి పద్ధతి

ప్రధాని మోడీని సిద్దు టార్గెట్ చేశారని పాత్రా ఆరోపించారు. ఇటీవల మోడీ ప్రభుత్వం .. బ్రిటీష్ హయాన్ని తలపిస్తోందని సిద్దూ విమర్శించిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే పాట్రా స్పందించారు. అది వారి మైండ్ సెట్ అని ఆరోపించారు.

తసీర్ ఇన్ఫో మార్చారు ..

తసీర్ ఇన్ఫో మార్చారు ..

ఇటు మోడీపై కథనం రాసిన ఆతిష్‌ తసీర్‌ గురించి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా మార్చి వేశారు. తసీర్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి పీఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారంటూ యాడ్‌ చేశారు. మోడీ గురించి ‘టైమ్‌'లో వ్యాసం రాగా, ఆ మరుసటి రోజు వికీపీడియా పేజీని మార్చివేశారు. దానిని బీజేపీ సోషల్‌ మీడియా యూజర్‌ చౌకీదార్‌ శశాంక్‌ సింగ్‌ ట్వీట్‌ చేయగా, అది ఇప్పుడు రిట్వీట్‌ అవుతుంది.

కథనంతో కాంగ్రెస్ పీఆర్ మేనేజర్

కథనంతో కాంగ్రెస్ పీఆర్ మేనేజర్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ ప్రపంచ దిగ్గజంగా ఎదగాలంటే మోడీ లాంటి నేత అవసరమని గతంలో టైమ్‌ మేగజీన్‌ కవర్‌ పేజీతో ఆయన ఇంటర్వ్యూను ప్రచురించింది. ఇప్పుడు ఆ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయని, భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోదీ అన్నింటా విఫలమయ్యారని, ఆయన చర్యలు జాతీయ వాదానికి బీజం వేశాయంటూ విమర్శించింది. దీంతో కోపం వచ్చిన బీజేపీ సోషల్‌ మీడియా జర్నలిస్ట్, రచయిత అయిన ఆతిష్‌ తసీర్‌ను కాంగ్రెస్‌ పీఆర్‌ మేనేజర్‌ను చేసింది.

English summary
The BJP on Saturday slammed a TIME magazine article, which called Prime Minister Narendra Modi "divider in chief", as an attempt to malign Modi's image, accusing its author of pursuing Pakistan's agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X