వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్ -2 కథ ముగిసినట్లేనా: ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న శివన్..?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్‌లో తలెత్తిన సమస్యతో చివరినిమిషంలో జాబిల్లిపై ల్యాండ్ కావడంలో విఫలమైంది. అంతేకాదు భూమికి సంకేతాలు కూడా పంపడంలో విఫలమైంది. అయితే 14 రోజుల సమయంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబందాల పునరుద్ధరణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 7న తెల్లవారు జామున చంద్రుడిపై ల్యాండ్ కావాల్సిన విక్రమ్ ల్యాండర్ దిగలేదు. దీంతో 14 రోజుల సమయ కాస్త ముగిసిపోతోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 21కల్లా ల్యాండర్ తన పని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతవరకే దానికి సోలార్ పవర్ చార్జింగ్ ఉంటుంది. ఆతర్వాత స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధిరించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని చెబుతూ ఎక్కడో ఇంకా ఆశను వ్యక్తం చేస్తోంది ఇస్రో. ఇదిలా ఉంటే ఇస్రో అంతర్గత సమావేశంలో చంద్రయాన్-2 ప్రాజెక్టుకు ఫుల్‌స్టాప్ పెట్టి శాస్త్రవేత్తలను తదుపరి ప్రాజెక్టులపై పనిచేయాల్సిందిగా ఇస్రో చీఫ్ డాక్టర్ శివన్ సూచించినట్లు సమాచారం. ఇప్పటి వరకు విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఎలా ట్రాక్ తప్పిందనే సమాచారంను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే 400 మీటర్ల ఎత్తులో ల్యాండర్ ట్రాక్ తప్పిందని ఇస్రో మళ్లీ చెప్పింది.

Time of 14days running out for Chandrayaan-2, still no contact with lander

ఇక ఆర్బిటర్‌లో ఉన్న హై రిజల్యూషన్ కెమెరా చంద్రుడిపైన ల్యాండర్‌కు సంబంధించిన ల్యాండిగ్ ప్రాంతాన్ని ఫోటోలు తీసింది. అయితే దీనిపై మరింని వివరాలు చెప్పేందుకు ఇస్రో నిరాకరించింది. అక్కడి నుంచి వచ్చిన సమాచారంను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న కెమెరాల కంటే ఆర్బిటార్‌లో ఉన్న హై రిజల్యూషన్ కెమెరాకే అత్యధిక రిజల్యూషన్ కలిగి ఉంది.

English summary
It has been nearly a week since scientists at the Indian Space Research Organisation (ISRO) lost contact with the Chandrayaan-2 lander ‘Vikram’ — leading to an incomplete second lunar mission. ISRO has now very little time left as the lunar night — equal to 14 Earth days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X