హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TIMELINE : ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో అసలేం జరిగింది.. కరోనా లాక్ డౌన్‌ను ధిక్కరించారా?

|
Google Oneindia TeluguNews

సోమవారం(మార్చి 30) నాటికి భారత్‌లో కరోనా వైరస్ కాస్త అదుపులోనే ఉందని చాలామంది భావించారు. కానీ సాయంత్రం వరకే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిఘీ-జమాత్ కార్యక్రమ వివరాలు బయటకు రావడం.. చాలా రాష్ట్రాల్లో నమోదైన కరోనా మృతుల్లో వీరే ఎక్కువగా ఉండటంతో కొత్త అలజడి మొదలైంది. తెలంగాణలో మృతి చెందిన ఆరుగురికి మర్కజ్ మసీదుతో మూలాలు బయటపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా అదే మసీదులో చిక్కుకుపోయినవారిని టెస్టులు చేయగా సోమవారం 25 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ రాష్ట్రాలకు వెనుదిరిగినవారు.. ఎక్కడెక్కడ వైరస్‌ను అంటిస్తున్నారోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు తబ్లిఘీ-జమాత్‌లో ఎంతమంది పాల్గొన్నారు.. అసలక్కడ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆ టైమ్ లైన్‌ను పరిశీలిద్దాం..

మార్చి 13-మార్చి 16

మార్చి 13-మార్చి 16

మార్చి 13న నిజాముద్దీన్ మర్కజ్‌లో దాదాపు 3400 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. మార్చి 16న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాజిక,రాజకీయ,మతపరమైన అన్ని కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. మార్చి 31 వరకు ఎక్కడా 50 మందికి మించి ఏ ఈవెంట్ జరగవద్దని ఆదేశించారు. కానీ మర్కజ్ మసీదులో మాత్రం ఆ తర్వాత కూడా భారీ సంఖ్యలో జనం అక్కడే ఉండిపోయారు.

మార్చి 20-మార్చి 24

మార్చి 20-మార్చి 24

మార్చి 20న తెలంగాణలో 10 మంది ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్టు గుర్తించారు. మార్చి 22న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించారు. ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఏ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు. మార్చి 23న మర్కజ్ నుంచి 1500 మంది బయటకు వెళ్లిపోయారు. మార్చి 24న ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసర సేవలు తప్ప అన్నింటిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.

మార్చి 24 - మార్చి 25

మార్చి 24 - మార్చి 25

మర్కజ్‌లో ఉండిపోయిన మిగతావారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని మార్చి 24న పోలీసులు ఆదేశించారు. కానీ లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా మార్చి 25న కూడా దాదాపు 1000మంది మర్కజ్‌లోనే ఉండిపోయారు. అదే రోజు ఒక మెడికల్ బృందాన్ని అక్కడికి పంపించి...అధికారులు అక్కడివారికి టెస్టులు నిర్వహించారు. అనుమానిత కేసులను అదే భవనంలోని హాలులో ఐసోలేట్ చేశారు. అదే రోజు జమాత్ అధికారులు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లారు. మర్కజ్‌ను ఖాళీ చేసేందుకు సమయం కావాలని కోరారు. అక్కడున్న వాహనాల నెంబర్స్‌ను కూడా అందజేశారు.

మార్చి 26-మార్చి 28

మార్చి 26-మార్చి 28

మార్చి 26న శ్రీనగర్‌లో ఓ మత ప్రబోధకుడు మృతి చెందాడు. అంతకుముందు అతను ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. అదే రోజు ఢిల్లీలోని మర్కజ్ జమాత్ అధికారులను సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సమావేశానికి పిలిచి చర్చించారు. మార్చి 27న మర్కజ్ నుంచి కరోనా అనుమానితులైన ఆరుగురిని హర్యానాలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌కు తరలించారు. మార్చి 28న స్థానిక ఎస్‌డీఎంతో కలిసి డబ్ల్యూహెచ్ఓ(WHO) బృందం మర్కజ్‌ను సందర్శించింది. అక్కడినుంచి 33 మందిని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే రోజు లజపత్ నగర్ ఏసీపీ.. మర్కజ్‌ను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

మార్చి 29..

మార్చి 29..

మార్చి 29న ఏసీపీ నోటీసులకు మర్కజ్ అధికారులు బదులు పంపించారు. మర్కజ్‌లోకి కొత్తగా ఇంకెవరూ రారని.. ఇప్పటివరకు ఉన్నవాళ్లు అక్కడే ఉంటారని అందులో పేర్కొన్నారు. లాక్ డౌన్ కంటే ముందే ఈ కార్యక్రమం జరిగినందువల్ల చాలామంది ఇక్కడే ఉండిపోయారని చెప్పారు. ప్రధాని మోదీ సైతం తన స్పీచ్‌లో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని చెప్పిన ఆదేశాలను అందులో ప్రస్తావించారు. అంతేకాదు,అక్కడి పరిస్థితుల గురించి ఢిల్లీ ప్రభుత్వానికి తెలుసని అందులో పేర్కొనడం గమనార్హం. అదే రోజు స్థానిక పోలీసులు,ఆరోగ్య శాఖ అధికారులు మర్కజ్ నుంచి వారిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రులకు,క్వారెంటైన్ కేంద్రాలకు తరలించారు.

పోలీసులు ఏమంటున్నారు..

పోలీసులు ఏమంటున్నారు..


తాము రెండుసార్లు నోటీసులు పంపించినా మర్కజ్ ప్రతినిధులు పట్టించుకోలేదని పోలీసులు చెప్పారు. మార్చి 23,28 తేదీల్లో నోటీసులు పంపించినట్టు తెలిపారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. మార్చి 23న మర్కజ్ నుంచి 1500 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించారు. అయితే అందులో ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉందనేది తెలియదు. దీనిపై మర్కజ్ అధికారులు మాట్లాడుతూ.. మార్చి 23న తమ వాహనాలు వెళ్లడానికి అనుమతివ్వాల్సిందిగా పోలీసులు లేఖ రాసినట్టు తెలిపారు. తద్వారా అక్కడికి వచ్చినవారిని పంపించాలనుకున్నట్టు చెప్పారు.

English summary
Delhi was put on complete lockdown days before Prime Minister Narendra Modi announced the nationwide lockdown. Over 3400 people had gathered at the Nizamuddin area for the Tablighi Jamaat event.Six people in Telangana have died after attending the religious event at Nizamuddin while some of the deaths in states like Maharashtra may also have links to this event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X