వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra, Haryana exit polls: మహారాష్ట్రలో బీజేపీ-శిసేన దాదాపు క్లీన్‌స్వీప్! హర్యానాలోనూ కాషాయమే

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా మళ్లీ మహారాష్ట్రలో బీజేపీదే అధికారమని పేర్కొనడం గమనార్హం.

టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం..

బీజేపీ, శివసేన కూటమి - 230 స్థానాల్లో విజయం సాధిస్తుంది.
కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి - 48 స్థానాల్లో మాత్రమే గెలుపు.
ఇతరులు 10 స్థానాల్లో గెలిపొందే అవకాశం ఉందని టౌమ్స్ నౌ వెల్లడించింది.

Times Now exit polls predict: BJP-Shiv Sena sweep predicted in Maharashtra, BJP in Haryana

ఇక ఓట్ల షేర్ గురించి పరిశీలిస్తే..

బీజేపీ, శివసేన కూటమికి.. 54.20శాతం
కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి.. 29.40శాతం
ఇతర పార్టీలకు.......................... 16.40శాతం

మొత్తం 288 స్థానాల్లో 230 స్థానాల్లో బీజేపీ, శివసేన కూటమి విజయం సాధించే అవకాశాలుండగా, కేవలం 48 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది.

ఇక హర్యానా అసెంబ్లీ విషయానికొస్తే..

హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ తేల్చేసింది.

బీజేపీ - 71
కాంగ్రెస్ - 11
ఇతరులు - 3

ఓట్ షేర్‌ను పరిశీలిస్తే..

బీజేపీ - 46.2 శాతం
కాంగ్రెస్ - 22.8 శాతం
జేజేపీ - 9 శాతం
ఇతరులు - 22 శాతం

మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మేజిక్ ఫిగర్ 145. ఇక్కడ బిజేపీ, మిత్రపక్షాలు కలిసి 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మరో మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 147, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన 101 స్థానాల్లో బరిలోకి దిగింది. ప్రముఖుల్లో ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ నైరుతీ నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ బోకార్ నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కారాడ్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, ఉద్దవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే శివసేన నుంచి వర్లి నుంచి పోటీలో ఉన్నారు.

హర్యానాలో 90 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 46. బీజేపీ, కాంగ్రెస్‌లు 90 స్థానాల్లో పోటీ పడుతుండగా, బీఎస్పీ 87 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తోంది. బరిలో ఉన్న ప్రముఖుల్లో బీజేపీ నేత, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నియోజకవర్గం నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా గర్హి శాంప్లా-కిలోయి నుంచి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఖైతాల్ నుంచి, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ నుంచి, ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింక్ చౌతాలా ఎల్లెనాబాద్ నుంచి బరిలో ఉన్నారు.

English summary
ముంబై: మహారాష్ట్రలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా మళ్లీ మహారాష్ట్రలో బీజేపీదే అధికారమని పేర్కొనడం గమనార్హం. టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం..బీజేపీ, శివసేన కూటమి - 230 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి - 48 స్థానాల్లో మాత్రమే గెలుపు.ఇతరులు 10 స్థానాల్లో గెలిపొందే అవకాశం ఉందని టౌమ్స్ నౌ వెల్లడించింది. ఇక ఓట్ల షేర్ గురించి పరిశీలిస్తే..బీజేపీ, శివసేన కూటమికి.. 54.20శాతంకాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి.. 29.40శాతంఇతర పార్టీలకు.......................... 16.40శాతంమొత్తం 255 స్థానాల్లో 230 స్థానాల్లో బీజేపీ, శివసేన కూటమి విజయం సాధించే అవకాశాలుండగా, కేవలం 48 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక హర్యానా అసెంబ్లీ విషయానికొస్తే..హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ తేల్చేసింది. బీజేపీ - 71కాంగ్రెస్ - 11ఇతరులు - 3ఓట్ షేర్‌ను పరిశీలిస్తే..బీజేపీ - 46.2 శాతంకాంగ్రెస్ - 22.8 శాతంజేజేపీ - 9 శాతంఇతరులు - 22 శాతం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X