వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే... మరోమారు మోడీ సర్కార్ కే పట్టం

|
Google Oneindia TeluguNews

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 19 విడుదలయ్యాయి లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ 306 సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ విఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. మరోమారు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పట్టం కట్టనున్నట్టు పేర్కొంది. ఎన్డీఏ కూటమి మే 19న జరిగిన ఎన్నికల్లో 132 సీట్లను సాధించవచ్చని సర్వే తెలిపింది.

ఆరా ఎగ్జిట్ పోల్స్ .. వైసీపీ దే హవా .. వైసీపీ 120-125 ,టీడీపీ 50-55, జనసేన 0ఆరా ఎగ్జిట్ పోల్స్ .. వైసీపీ దే హవా .. వైసీపీ 120-125 ,టీడీపీ 50-55, జనసేన 0

మళ్ళీ సర్కార్ ఎన్డీయేదే .. టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్

మళ్ళీ సర్కార్ ఎన్డీయేదే .. టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్

నేటితో ఎన్నికల నిర్వహణ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ సర్వే ను టైమ్స్ నౌ విఎంఆర్ ప్రకటించింది. ప్రజలు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లుగా పేర్కొంది. మే 11 మరియు మే 19, 2019 మధ్యకాలంలో టైమ్స్ నౌ విఎంఆర్ సర్వే నిర్వహించింది. 3211 ప్రత్యేక ప్రదేశాల్లో, విలక్షణమైన ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 40 వేల మందికి పైగా ఓటర్లను ప్రాతిపదికగా తీసుకుని సర్వే నిర్వహించింది. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా మరో 40 వేల మంది ఓటర్లను కూడా ప్రాతిపదికగా తీసుకొని సర్వే నిర్వహించింది. టైమ్స్ నౌ వీఎంఆర్ నిర్వహించిన సర్వేలో గత ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. నియోజక వర్గం యొక్క జనాభా ప్రాతిపదిక, ప్రస్తుత ఓటింగ్ సరళి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ తమ ప్రభావాన్ని చూపించింది వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది.

2019 ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే 306, యూపీఏ 132, ఇతరులు 104 స్థానాలు

2019 ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే 306, యూపీఏ 132, ఇతరులు 104 స్థానాలు

ఇక 2014 టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను చూసినట్లయితే ఎన్డీయే కూటమికి 336 సీట్లు వస్తాయని యూపీఏ కూటమికి 60 స్థానాలు వస్తాయని ఇక ఇతరులు 147 స్థానాల్లో విజయం సాధిస్తారని 2014 ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చింది. అయితే అందుకు భిన్నంగా 2014లో భారతీయ జనతా పార్టీకి 282 సీట్లు మాత్రమే దక్కాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా 2019 ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఎన్డీయే కూటమి 306 స్థానాలను గెలుచుకుంటుందని, యూపీఏ 132 స్థానాలను గెలుచుకుంటుందని, ఇతరులు 104 స్థానాలతో సరి పెట్టుకుంటారని సర్వే ఫలితాలను వెల్లడించింది టైమ్స్ నౌ వీ ఎం ఆర్.

2014 ఎగ్జిట్ పోల్స్ తో పోల్చి చూస్తే ఎన్డీయే కు తక్కువ స్థానాలు ... యూపీఏకు ఎక్కువ స్థానాలు

2014 ఎగ్జిట్ పోల్స్ తో పోల్చి చూస్తే ఎన్డీయే కు తక్కువ స్థానాలు ... యూపీఏకు ఎక్కువ స్థానాలు

2014 ఎగ్జిట్ పోల్స్ తో పోల్చి చూస్తే ఈసారి ఎన్డీఏ కూటమికి గత సారి ఇచ్చిన ఫలితాలకంటే 30 సీట్లు తక్కువగా వస్తాయని ప్రకటించింది. ఇక యూపీఏకి గత 60 స్థానాలు వస్తాయని చెప్తే ఈ సారి ఏకంగా 132 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి గతం కంటే 72 స్థానాలు అదనంగా వస్తాయని పేర్కొంది. ఇక ఇతరుల విషయానికి వస్తే 2014లో 147 స్థానాల్లో విజయం సాధిస్తారని చెప్పి ప్రస్తుతం104 స్థానాలతో సరిపెట్టుకుంటారు అని 43 స్థానాలు ఇతరులకు తక్కువగా వస్తాయని పేర్కొంది.

English summary
Prime Minister Narendra Modi-led National Democratic Alliance (NDA) is likely to win 306 seats in the Lok Sabha Elections 2019, as per Times Now-VMR exit poll 2019 results. The survey added that that the United Progressive Alliance may grab 132 seats in the elections that concluded earlier today (May 19). An exit poll is a survey of voters as they come out of the polling booths. The Election Commission of India will declare the final results on May 23.The Times Now-VMR Exit Poll 2019 was carried out between April 11 and May 19, 2019. The survey was carried out at 3,211 unique locations. The cumulative sample of the poll was more than 40,000 voters across the country. The exit poll also worked on samples of another 40,000 voters that carefully mirrored the demography, its swing segments, representation of past behaviour, and modelling of current voting intention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X