వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిప్పు సుల్తాన్ గొప్పవాడేం కాదు: సుబ్రహ్మణ్య స్వామి

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: టిప్పు సుల్తాన్ అంత గొప్ప వ్యక్తేమీ కాదని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి శనివారం వ్యాఖ్యానించారు. ఓఫెన్ ప్లాట్ ఫారం ఫర్ నేతాజీ అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సభళో సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

టిప్పు సుల్తాన్‌ను ఫ్రెంచి వారి బానిసగా అభివర్ణించారు. కర్నాటక ప్రభుత్వం అధికారికంగా టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు నిర్వహించేందుకు.. ఆయన వద్ద విశిష్ట లక్షణాలు ఏమీ లేవన్నారు. టిప్పుసుల్తాన్ తనంతట తాను సొంతగా కాకుండా ఫ్రెంచ్ తరఫునే బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడాడని చెప్పారు.

 Tipu Sultan Had No Qualities Worth Celebrating, Says Subramanian Swamy

ఆఫ్రికాతో యుద్ధానికి సిద్ధమైన ఫ్రాన్స్ అధినేత నెపోలియన్.. భారత్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు టిప్పు సుల్తాన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్నారు.

మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫైల్ రీఓపెన్ చేయాలి

జాతిపిత మహాత్మా గాంధీ హత్య కేసును రీ ఓపెన్ చేయాలని బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారని తెలుస్తోంది. కాగా, సుబ్రహ్మణ్య స్వామి గత ఏడాది బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన అంతకుముందు జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అనంతం ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశారు.

English summary
BJP leader Subramanian Swamy today described Tipu Sultan as a "servant of the French" and said the 18th century ruler of Mysore had no qualities for his memory to be celebrated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X