వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిప్పు సుల్తాన్ స్వతంత్ర పోరాటం చేశారా?: హైకోర్టు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే హై కోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. టిప్పు సుల్తాన్ స్వతంత్ర పోరాటం చేశారా ? అని ప్రశ్నించడంతో కర్ణాటక ప్రభుత్వం షాక్ తినింది.

టిప్పు సుల్తాన్ జయంతిని ఎందుకు నిర్వహించాలి అని అనుకుంటున్నారు అంటూ కర్ణాటక హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కే. ముఖర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే, ఆంగ్లేయులు దండెత్తి వచ్చిన సమయంలో తన రాజ్యాన్నికాపాడుకోవడం కోసం మాత్రమే నిజాంలకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.

Tipu Sultan not freedom fighter. observes Karnataka High Court

అంతే కాని టిప్పు సుల్తాన్ స్వతంత్ర పోరాటం చెయ్యలేదని అన్నారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల ఉద్దేశం ఏమిటి ? ఎందుకు చెయ్యాలని నిర్ణయించారు అని చెప్పాలని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణాటక ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజల సోమ్ము ఖర్చు పెట్టి చెయ్యాలని నిర్ణయించిందని కొడుగుకు చెందిన సామాజిక కార్యకర్త కేపి. మంజునాథ్ కర్ణాటక హై కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణలో భాగంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఈ విషయంపై ప్రశ్నించింది. గురువారం మళ్లీ పిటిషన్ విచారణకు రానుంది.

English summary
K.P. Manjunathja of Kodagu had filed the PIL opposing the state government's decision to celebrate Tipu Jayanti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X