వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాడి తన్నేవాడు మోడీ అయితే..!!

|
Google Oneindia TeluguNews

పాట్నా: తాడి తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడనేది ఓ సామెత. ఇప్పుడిది బిహార్ రాజకీయాలకు అతికినట్టు సరిపోతోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆపరేషన్ లోటస్‌ను తెరమీదికి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీకి తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నేలమట్టమైంది. బీజేపీయేతర ప్రభుత్వాలను నేలమట్టం చేయడంలో చేయి తిరిగిన మోడీ-అమిత్ షా జోడీ జోరుకు బిహార్‌లో బ్రేక్ పడింది.

ప్రమాదాన్ని శంకించి..

ప్రమాదాన్ని శంకించి..


మహారాష్ట్ర తరహాలో బీజేపీ- తన సొంత పార్టీలో ఏక్‌నాథ్ షిండేను తయారు చేస్తోందని జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముందే పసిగట్టగలిగారని.. అందుకే గుడ్‌బై చెప్పారనే ప్రచారం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఆర్జేడీ అండతో ప్రభుత్వాన్ని నెలకొల్పారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ఎనిమిది సంవత్సరాల్లో..

ఈ ఎనిమిది సంవత్సరాల్లో..

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆపరేషన్ లోటస్‌ను యాక్టివేట్ చేసింది బీజేపీ. అరకొర మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీయేతర ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి తీసుకొచ్చిన స్కీం ఇది. తొలిసారిగా కర్ణాటకలో తెరమీదికి వచ్చింది. బీజేపీ హైకమాండ్ ఆశించిన రిజల్ట్ ఇచ్చింది. దీన్నే మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రయోగింది. అక్కడా సక్సెస్ సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ప్రయత్నించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు.

కర్ణాటకతో మొదలు..

కర్ణాటకతో మొదలు..


2019లో కర్ణాటకలో అధికారాన్ని ఏర్పాటు చేసిన జనతాదళ్ (సెక్యులర్)-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది బీజేపీ. ఏకంగా 17 మంది కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన శాసనసభ్యులను తన వైపు తిప్పుకొంది. పార్టీ కండువాను కప్పింది. ఆయా ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో.. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని కూటమి సర్కార్ కుప్పకూలింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలతో జేడీఎస్-కాంగ్రెస్ మైనారిటీలో పడింది. బలనిరూపణకు ముందే కుమార స్వామి రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లో..

ఇదే ఆపరేషన్ లోటస్ అటు మధ్యప్రదేశ్‌లోనూ విజయవంతమైంది. బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను నిట్ట నిలువుగా చీల్చగలిగింది బీజేపీ. బలమైన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని ఆపరేషన్ లోటస్‌తో ఆకర్షించగలిగింది. ఆయనను పార్టీలో చేర్చుకుంది. రాజ్యసభకు ఎంపిక చేసింది. కేంద్రమంత్రి పదవినీ అప్పగించింది. సింధియా వర్గానికి చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో- కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేలమట్టమైంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు.

 మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో..

కొత్తగా మహారాష్ట్ర ఎపిసోడ్‌లో కూడా అదే జరిగింది. అధికార శివసేనలో చీలిక తీసుకుని రాగలిగారు కమలనాథులు. ఆపరేషన్ లోటస్ దెబ్బకు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవదీశారు. మెజారిటీ శాసనసభ్యులను తనవైపు తిప్పుకొన్నారు. క్యాంప్ రాజకీయాలను నిర్వహించారు. ఉద్ధవ్ థాకరేను గద్దె దించగలిగారు. ఇక్కడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. శివసేన చీలిక వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

Recommended Video

ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ *Politics | Telugu OneIndia
మరో ఉద్ధవ్ థాకరేగా నితీష్ కుమార్..

మరో ఉద్ధవ్ థాకరేగా నితీష్ కుమార్..

బిహార్‌లో నితీష్ కుమార్ సారథ్యాన్ని వహిస్తోన్న జేడీయూలో చీలికను తీసుకుని రావడానికి బీజేపీ ప్రయత్నించిందనేది బహిరంగ రహస్యంగా మారింది. నితీష్ కుమార్‌కు తెలియకుండా ఆయన పార్టీలో ఏక్‌నాథ్ షిండేను తయారు చేయడానికి బీజేపీ వ్యూహం పన్నిందనే ప్రచారం ఉంది. దాన్ని ముందే పసిగట్టడంతో నితీష్ కుమార్ అప్రమత్తం అయ్యారని, ఏకంగా బీజేపీతోనే తెగదెంపులు చేసుకున్నారని చెబుతున్నారు. ఏ మాత్రం అలసత్వాన్ని ప్రదర్శించిన ఉన్నా.. నితీష్ కుమార్ మరో ఉద్ధవ్ థాకరే అయ్యేవారని అంటున్నారు.

English summary
Tit for Tat: For the first time Modi govt dethroned by Nitish Kumar in Bihar, here are the takeaways
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X