• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లు

|

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభాసుపాలయ్యారు. వేడుకల పేరిట అసభ్య నృత్యాలు చేయిస్తూ పరువు తీసుకున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షమైన టీఎంసీకి తలనొప్పులు తప్పడం లేదు. విపక్షాలకు అస్త్రంగా మారడంతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు ఎన్నికల నాటి వేడిని మళ్లీ రాజేస్తూ టీఎంసీ లీడర్లను ఆటాడుకుంటున్నారు.

పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీకి ఈ ఎపిసోడ్ తలనొప్పి వ్యవహారంలా తయారైంది. సందట్లో సడేమియాలా కొందరు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టార్గెట్‌గా ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు.

 పేరుకేమో ఎంపీ అభినందన సభ.. చేసిందేమో రికార్డింగ్ డ్యాన్సులు

పేరుకేమో ఎంపీ అభినందన సభ.. చేసిందేమో రికార్డింగ్ డ్యాన్సులు

టీఎంసీ ఎంపీగా మిమి చక్రవర్తి జాదవ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ మేరకు మంగళవారం (25.06.2019) నాడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె అనుచరులు, పార్టీ కార్యకర్తలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ధూం మచాలే అనుకున్నారో ఏమో గానీ రికార్డింగ్ డ్యాన్సులు చేయించడం రచ్చ రచ్చయింది.

పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!

యువకులను రెచ్చగొట్టిన డ్యాన్సర్.. దుస్తులు పైకి లేపుతూ..!

యువకులను రెచ్చగొట్టిన డ్యాన్సర్.. దుస్తులు పైకి లేపుతూ..!

రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి వచ్చిన యువతి అక్కడి యువకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. చీటికిమాటికీ దుస్తులు పైకి లేపుతూ నానా హంగామా చేసింది. దాంతో ఈలలు, అరుపులతో అభినందన సభ కాస్తా ట్రాక్ తప్పింది. కొందరు యువకులు ఆ తతంగమంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం కాస్తా బయటపడింది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో విపక్ష నేతలకు అస్త్రం దొరికినట్లైంది. దాంతో టీఎంసీ కార్యకర్తలు క్రమశిక్షణ లేకుండా ఇలా ప్రవర్తిస్తారా అంటూ వీర లెవెల్లో మండిపడుతున్నారు.

అదలావుంటే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశించిన స్థాయిలో లోక్‌సభ ఫలితాలు దక్కలేదు. దాంతో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ పార్టీ ఎంపీ మిమి చక్రవర్తి అభినందన సభ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం రచ్చ రచ్చయింది.

బీజేపీ నేత వ్యంగ్యాస్త్రాలు.. అది టీఎంసీ కల్చర్ అంటూ ఎద్దేవా

బీజేపీ నేత వ్యంగ్యాస్త్రాలు.. అది టీఎంసీ కల్చర్ అంటూ ఎద్దేవా

బీజేపీ నేత సునీప్ దాస్ ఆ ఎపిసోడ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వీడియోలో నాకు కొత్తగా ఏమి కన్పించలేదంటూ సెటైర్లు వేశారు. అది మొదటినుంచి టీఎంసీ కల్చరే కదా అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ అధినేత్రికి తెలియకుండా టీఎంసీ కార్యకర్తలు ఏ పని చేయబోరని.. ఈ ఘటనపై ఆమె ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అదలావుంటే దీనంతటికీ కారణమైన ఆ పార్టీ ఎంపీ మిమి చక్రవర్తి కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ తీరుగా సాగుతున్న పరోక్ష యుద్దానికి ఈ రికార్డింగ్ డ్యాన్స్.. మండుతున్న అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As Jadavpur MP Mimi Chakraborty took oath in the Lok Sabha on Tuesday, her constituency celebrated her debut in the Parliament in an objectionable manner. Recording Dance Programme Held in volgur way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more