వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో వలసల పర్వం : బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యే, 12 మంది కౌన్సిలర్లు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కూడా వలసల పర్వం కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవల ముగ్గురు ఎంపీలు, 50 మంది కౌన్సిలర్లు టీఎంసీకి టాటా చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత మళ్లీ బెంగాల్‌లో వలసల పర్వం ఊపందుకుంది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా కమలం గూటికి చేరడం గమనార్హం.

బెంగాల్‌పై దృష్టి ..
బెంగాల్‌లో మెజార్టీ లోక్‌సభ స్థానాలు సాధించిన బీజేపీ .. అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. అధికార టీఎంసీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. బీజేపీ కుటిల నీతిని గమనించిన దీదీ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో వలసలు కంటిన్యూ అవుతున్నాయి. బెంగాల్ బీజేపీ నేత కైలాస్, బీజేపీ నేత ముకుల్ రాయ్ సమక్షంలో టీఎంసీ ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్ కమలం గూటికి చేరారు. ఆయనతోపాటు 12 మంది కౌన్సిలర్లు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రసన్‌జీత్ ఘోష్ కూడా బీజేపీలో చేరారు.

TMC MLA, 12 councillors cross border to BJP

వలసల పర్వం ...
ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యే సునీల్ సింగ్, 15 మంది కౌన్సిలర్లు, మరో కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో పరిస్థితి మారిపోయింది. అంతకుముందు టీఎంసీ హవా కొనసాగేది. కానీ ప్రస్తుతం మాత్రం బీజేపీ ట్రెండ్ నడుస్తోంది. మమతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు బీజేపీలో చేరుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

దీనికితోడు ఇటీవల బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడాన్ని కూడా కమలదళం తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. మమత హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని గుర్తుచేసింది. రాష్ట్రంలో శాంతిని కాపాడుకుంటూనే .. అభివృద్ధి చేస్తామని బీజేపీ నేత కైలాశ్ పేర్కొన్నడం దీనికి సంకేతంగా భావించవచ్చు. మమత బెనర్జీ సీఎం పదవీ చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆయన మండిపడ్డారు.

English summary
In yet another wave of TMC migration to BJP, a legislator from Mamata Banerjee camp jumped ship to join the saffron party on Tuesday. TMC MLA from Bongaon Biswajit Das joined BJP in New Delhi in the presence of party's West Bengal leaders Kailash Vijayvargiya and Mukul Roy. Along with Biswajit Das, 12 TMC councillors and Congress spokesperson Prasanjeet Ghosh also joined the BJP. This comes a day after another TMC MLA - Noapara legislator Sunil Singh, along with the 15 TMC councillors and another Congress councillor, had joined the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X