వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రమాత్రలు మింగిన సినీ నటి, ఎంపీ నుస్రత్?.. షాకైన ఫ్యామిలీ.. అసలేం జరిగిందంటే!

|
Google Oneindia TeluguNews

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్ అనూహ్యంగా ఆస్పత్రిపాలు కావడం దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా మారింది. అయితే మితిమీరిన మెడిసిన్ తీసుకోవడంతోనే ఆమె ఆరోగ్యం క్షిణించిందనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తనపై వస్తున్న వార్తలపై నుస్రత్ తల్లిదండ్రులు స్పందించారు. ఓవర్‌గా మెడిసిన్ తీసుకోవడం ఆమె ఆరోగ్యం క్షీణించలేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

భర్త జన్మదిన వేడుకల్లో

భర్త జన్మదిన వేడుకల్లో

బెంగాలీ యాక్టర్, ఎంపీ నుస్రత్ జహాన్ భర్త నిఖిల్ జైన్ తన జన్మదినాన్ని ఆదివారం జరుపుకొన్నారు. ఆ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ క్రమంలోనే నుస్రత్ ఆరోగ్య క్షీణించడంతో భార్త రాత్రంతా హస్పిటల్‌లోనే ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో టర్కీలోని బోడ్రమ్‌లో పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్‌ను నుస్రత్ వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి విహార యాత్రలతో ఈ నవ దంపతులు హల్‌చల్ చేస్తున్నారు.

అనూహ్యంగా ఆరోగ్యం క్షీణించడంతో

అనూహ్యంగా ఆరోగ్యం క్షీణించడంతో

నుస్రత్ జహాన్‌ను ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో హుటాహుటిన అపోలో గ్లెనీగెల్స్‌లోని ఐసీయూలోకి తరలించారు. దాంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో, సన్నిహితులు, స్నేహితులు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. నుస్రత్ ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మిగడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆమెపై రూమర్లు సోషల్ మీడియాలో స్వైర విహారం చేశాయి.

అపోలో హాస్పిటల్ చేరిక

అపోలో హాస్పిటల్ చేరిక

ఆ క్రమంలో నుస్రత్‌కు ప్రత్యేక వైద్యులు బృందం చికిత్స అందించింది. ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోమవారం సాయంత్రం ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. అనంతరం మీడియాతో తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఓవర్‌డోస్ మాత్రలు మింగడం వల్ల హస్పిటల్‌లో చేరలేదని స్పష్టం చేశారు. ఆమె వస్తున్న రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.

 ఫ్యామిలీ క్లారిటీ

ఫ్యామిలీ క్లారిటీ

నుస్రత్ జహాన్‌ ఆస్తమా సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. అసరమైనప్పుడు ఇన్‌హెలర్ వాడుతారు. ఆదివారం సాయంత్రం ఆమె పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ క్రమంలోనే ఇన్ హెలర్‌తో సమస్య తగ్గకపోవడంతో మోతాదుకంటే ఎక్కువ మెడిసిన్ తీసుకొన్నారు. దాంతో ఆమెను హస్పిటల్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని నుస్రత్ తల్లిదండ్రులు స్పష్టత ఇచ్చారు.

Recommended Video

Congress MLA Sridhar Babu Fired On Minister Koppula Eshwar About Singareni || Oneindia Telugu
రూమర్లు క్రియేట్ చేయకండి

రూమర్లు క్రియేట్ చేయకండి


అయితే నుస్రత్‌పై రూమర్లు ఆగకపోవడంతో ఆమె సన్నిహితులు కూడా మీడియాతో మాట్లాడారు. మా దృష్టికి ఏవేవో రూమర్లు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదు. ఆమె కుటుంబం తరఫున మేము స్పందిస్తూ వివరణ ఇచ్చేది ఇదే. అనవసరమైన రూమర్లను ప్రచారం చేయకండి. వారి ప్రైవేట్ లైఫ్‌పై ఎలాంటి రూమర్లు క్రియేట్ చేయకండి అని అన్నారు.

English summary
TMC MP Nusrat Jahan hospitalised on Sunday. Reports suggest that had consumed a large number of sleeping pills. But condemns, rumours are baseless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X