• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దీదీపై దాడితో ఢిల్లీకి చేరిన పంచాయితీ .. టీఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల వాయిదా

|

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోసం బీజేపీ టీఎంసీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రత్యర్ధిగా మారిన తరువాత రూట్ మార్చుకుని మమతాబెనర్జీ , నందిగ్రామ్ లో సువేందు అధికారిని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. బెంగాల్ ఆడబిడ్డగా చెప్పుకుంటున్న మమతాబెనర్జీ బిజెపిని ఎదుర్కోవడానికి సింపతీ పాలిటిక్స్ పై ఫోకస్ చేశారు.

బీజేపీ డబ్బులిస్తే తీసుకోండి..వాళ్ళని ఏప్రిల్ ఫూల్ చెయ్యండి:నందిగ్రామ్ లో మమత సంచలన వ్యాఖ్యలు బీజేపీ డబ్బులిస్తే తీసుకోండి..వాళ్ళని ఏప్రిల్ ఫూల్ చెయ్యండి:నందిగ్రామ్ లో మమత సంచలన వ్యాఖ్యలు

 మమతా బెనర్జీ పై దాడి ఘటనతో పశ్చిమ బెంగాల్ లో హీటెక్కిన పాలిటిక్స్

మమతా బెనర్జీ పై దాడి ఘటనతో పశ్చిమ బెంగాల్ లో హీటెక్కిన పాలిటిక్స్

పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ డిజిపిని ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత మమతా బెనర్జీపై దాడి జరగడంతో, బీజేపీని మార్చటం వల్లే దాడి జరిగింది అనే మాటను టీఎంసీ ప్రజల్లోకి తీసుకు వెళుతుంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఆమె ప్రత్యర్థిగా మారిన సువేందు అధికారికి వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేయడానికి మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేసిన కొద్ది గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు.

టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల వాయిదా ..

టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల వాయిదా ..


దాడికి ముందు, మ్యానిఫెస్టోను గురువారం విడుదల చేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. కాని మమతా బెనర్జీకి అయిన గాయం వల్ల ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది.

మమతా బెనర్జీకి చికిత్స చేస్తున్న వైద్యులు ఆమె ఎడమ చీలమండకు తీవ్ర గాయమైందని, ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. ఆమె కుడి భుజం, కుడి ముంజేయి మరియు మెడకు కూడా గాయం అయినట్లుగా తెలిపారు. ఆమె ఛాతీ నొప్పి మరియు శ్వాస సమస్య గురించి ఫిర్యాదు చేసిందని ముఖ్యమంత్రిని చేర్చుకున్న ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ మోనిమోయ్ బెనర్జీ అన్నారు.

మమతా బెనర్జీ కోలుకున్న తర్వాతే మేనిఫెస్టో విడుదల

మమతా బెనర్జీ కోలుకున్న తర్వాతే మేనిఫెస్టో విడుదల

పశ్చిమ బెంగాల్ పాలక తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) గురువారం తన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల వాయిదా పడింది . మ్యానిఫెస్టోను విడుదల చేసిన తర్వాత బెనర్జీ ప్రెస్ మీట్‌లో ప్రసంగించాల్సి ఉంది. కానీ మమతా బెనర్జీ పై దాడి చేయడంతో ప్రస్తుతం గాయాలపాలైన మమతా బెనర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం వాయిదా పడినట్లు సమాచారం.

 మమతపై దాడి ఘటనతో పెరిగిన మాటల దాడి

మమతపై దాడి ఘటనతో పెరిగిన మాటల దాడి


2019 జాతీయ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన తరువాత పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకునే ఆలోచనలోకి దిగిన భారతీయ జనతా పార్టీ, మమతా బెనర్జీ సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నట్లుగా ఆరోపించింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై... వైద్యులు నివేదిక విడుదల చేశారు. ఎడమ కాలు చీలమండ, పాదంలో ఎముకకు తీవ్ర గాయాలు ఉన్నట్లు వారు వెల్లడించారు. దీదీ కుడి భజం, మెడకు గాయాలయ్యాయని స్కానింగ్‌లో తేలిందన్నారు. ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో మమత...ఇబ్బందులకు గురవుతున్నారని వైద్యులు తెలిపారు.

 ఢిల్లీ కి చేరిన మమతపై దాడి పంచాయితీ

ఢిల్లీ కి చేరిన మమతపై దాడి పంచాయితీ

మరోవైపు...రెండు, మూడు రోజుల్లో మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ. వీల్‌చైర్‌ సాయంతో అయినా ప్రచారం నిర్వహిస్తానన్నారు. ఇక దీదీ పై దాడి ఘటనపై సీరియస్ గా ఉన్న టిఎంసి పార్టీ నేతలు నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నల్లజెండాలతో మౌనంగా ఈనాడు దీక్షను కొనసాగిస్తానని టీఎంసీ నేతలు తెలిపారు . ఢిల్లీకి వెళ్లిన టిఎంసి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి మమతా బెనర్జీ పై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. మొత్తానికి అసలే మాటల తూటాలు పేల్చుతూ రసవత్తరంగా సాగుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల రాజకీయం మమతా బెనర్జీ పై జరిగిన దాడి ఘటనతో కొత్త మలుపు తీసుకుంది.

English summary
West Bengal’s ruling Trinamool Congress (TMC) on Thursday said that the release of its election manifesto has been postponed as chief minister Mamata Banerjee has been hospitalised after an alleged attack on her a day earlier. Banerjee was scheduled to address a press meet after releasing the manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X