వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కి 28, బీజేపీకి 11 లోక్ సభ స్థానాలు .. పుంజుకున్న బీజేపీ .. టైమ్స్ నౌ సర్వే

|
Google Oneindia TeluguNews

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. హోరాహోరీగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది టైమ్స్ నౌ వీఎంఆర్ . పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఈ సారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 6 స్థానాలు కోల్పోనున్నట్టు ప్రకటించింది. . 2014 లో కంటే కాస్త మెరుగ్గా ఈ దఫా ఎన్డీయే ప్రభావం కనిపించనుందని పేర్కొంది.

పశ్చిమబెంగాల్ లో బీజేపీ 11 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలు

పశ్చిమబెంగాల్ లో బీజేపీ 11 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలు

42 లోక్సభ స్థానాలున్నపశ్చిమ బెంగాల్ లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి 11 స్థానాలను దక్కించుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది . మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో టైమ్స్ నౌ వి ఎం ఆర్ నిర్వహించిన సర్వేలో పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 34 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. . ఇక ఈ సారి పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ గతంతో పోల్చుకుంటే ఆరు స్థానాలలో పట్టు కోల్పోతుంది అని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది .

ఇక కాంగ్రెస్ 2 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని అంచనాలను వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్ లో టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఇలా

పశ్చిమ బెంగాల్ లో టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఇలా

ఇక పోలింగ్ శాతం చూసినట్లయితే ఎన్డీఏ పోలింగ్ శాతం 2014లో 16.8 శాతం కాగా 2019 నాటికి మెరుగుపడి 31.86 శాతానికి చేరిందని అంచనా వేసింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పోలింగ్ శాతం 39.4 శాతం నుండి 2019 నాటికి 39.1 శాతానికి తగ్గిందని అంచనా వేసింది. మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు ) నాయకత్వంలోని వామపక్ష కూటమి పోలింగ్ శాతం భారీగా తగ్గనుందని పేర్కొంది. 15. 9 శాతంతో ఒక బేసి అంకె స్థానాన్ని మాత్రమే గెలుచుకోనుందని అంచనా వేసింది.

గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా 6 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ కోల్పోయే ప్రమాదం

గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా 6 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ కోల్పోయే ప్రమాదం

ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గతంతో పోలిస్తే కాస్త పుంజుకోనుంది . ఈసారి ఎలాగైనా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో హోరాహోరీగా పోరాడిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మరోమారు తన ఆధిక్యాన్ని ప్రదర్శించనుంది. అయినప్పటికీ ఈ దఫా ఒక ఆరు స్థానాలు కోల్పోనున్నట్టు టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే వెల్లడించింది. టైమ్స్ నౌ వీఎంఆర్ ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ 3211 చోట్ల 40 వేల మంది ఓటర్లను ప్రాతిపదికగా తీసుకొని సర్వే నిర్వహించి ఈ ఫలితాలను వెల్లడించింది.

English summary
After the successful completion of the seventh and final phase of the 2019 Lok Sabha elections, the Bharatiya Janata Party (BJP) has been predicted to significantly improve on its seat count in the state of West Bengal while the ruling Trinamool Congress (TMC) is likely to take a slight hit on its standing in the state. According to the Times Now-VMR Exit Poll, the saffron party is expected to bag 11 Lok Sabha seats with a greater vote share than it received in the 2014 general elections while the TMC is braced to see out an outcome of 28 seats with virtually no change in the seat share.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X