పశ్చిమ బెంగాల్‌లో తిరుగులేని ఆధిక్యత

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో పంచయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గ్రామస్థాయిలో ఏ పార్టీకి పట్టు ఉందో తేల్చేశాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ- వీటిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులను ఒడ్డాయి.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యతను సాధించింది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవాలను మిగిల్చాయి ఈ ఎన్నికలు. అటు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మమత బెనర్జీ ఛరిష్మాను అడ్డుకోలేకపోయింది.

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్‌లో 3,317 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 22 జిల్లా పరిషత్‌లలో 928 సీట్లు, 9,730 పంచాయతీ సమితి స్థానాలు, 63,229 గ్రామ పంచాయతీ వార్డుల్లో ఈ నెల 8వ తేదీన పోలింగ్ జరిగింది. ఇవ్వాళ ఓట్ల లెక్కింపు మొదలైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,36,464 నామినేషన్లు దాఖలయ్యాయి.

అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి 85,817 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ 56,321 మంది అభ్యర్థులను రంగంలో దించింది. సీపీఎం 48,646, కాంగ్రెస్- 17,750 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగించాయి.

Suvendu Adhikari

గ్రామస్థాయిలో ప్రజలు మాత్రం మమత బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ఆమె సారథ్యాన్ని వహిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యతను కట్టబెట్టారు. రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం- తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 18,590 గ్రామ పంచాయతీల్లో ఘన విజయాన్ని సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు తిరుగులేని మెజారిటీతో విజయఢంకా మోగించారు.

ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ 4,479 స్థానాలకే పరిమితమైంది. సీపీఐ (ఎం)- 1,426, కాంగ్రెస్‌ 1,071 గ్రామ పంచాయతీ స్థానాలను గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 1,062 చోట్ల గెలిచారు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. సుమారు 697 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+