చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టాలిన్, 21 మంది ఎమ్మెల్యేలకు కాస్త ఊరట: అంత వరకు వద్దని చెప్పిన హై కోర్టు, గుట్కా కేసు !

తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ కు కాస్త ఊరట లభించింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ కు కాస్త ఊరట లభించింది. తమిళనాడు శాసన సభ స్పీకర్ ఎంకే. స్టాలిన్ తో పాటు డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల మీద వేటు వెయ్యకుండా మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తమిళనాడులో చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ, అన్నాడీఎంకే పార్టీ చెయ్యి జారితే అదే సీన్!తమిళనాడులో చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ, అన్నాడీఎంకే పార్టీ చెయ్యి జారితే అదే సీన్!

శాసన సభలోకి గుట్కా ప్యాకెట్లు తీసుకు వచ్చారని, నియమాలు ఉల్లంఘించిన మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని తమిళనాడు శాసన సభ క్రమశిక్షణా కమిటీ ఎంకే. స్టాలిన్ తో సహ డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో ఎంకే. స్టాలిన్ ఆరోపించారు.

TN Assembly rights panel case on DMK MLAs postponed oct 27

తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తూ తమిళనాడు స్పీకర్ ధనపాల్ చర్యలు తీసుకున్నారు. ఇక డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందని జోరుగా ప్రచారం జరిగింది.

తమిళనాడు సీఎం మీద తిరుబాటు; 18 మంది ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా, టెన్షన్ !తమిళనాడు సీఎం మీద తిరుబాటు; 18 మంది ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా, టెన్షన్ !

తమ మీద ఎక్కడ సస్పెన్షన్ వేటు పడుతుందో అంటూ అందోళనతో డీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం డీఎంకే పార్టీ ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు అక్టోబర్ 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

English summary
Tamil Nadu Assembly Rights panel notice issued to 21 MLAs on Gutkha issue. Chennai HC adjourns hearing on this case to Oct 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X