చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి ఆరోగ్యం విషమం, హై అలర్ట్, ఆసుపత్రిలో సీఎం పళని, పన్నీర్ , భారీ బందోబస్తు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి (94) ఆరోగ్యం విషమంగా ఉందని ప్రచారం జరగడంతో చెన్నైలోని ఆళ్వార్ పేట్ లోని కావేరీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చెయ్యిదాటకుండా చూడటానికి తమిళనాడు ప్రభుత్వం ఆళ్వార్ పేట్ లోని కావేరీ ఆసుపత్రి దగ్గర 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి హై అలర్ట్ ప్రకటించింది. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి తన అధికార పర్యటనలు అన్నీ రద్దు చేసుకుని సేలం నుంచి చెన్నై చేరుకున్నారు.

Recommended Video

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల
పళని, పన్నీర్ సెల్వం

పళని, పన్నీర్ సెల్వం

సోమవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కావేరీ ఆసుపత్రి చేరుకుని డీఎంకే చీఫ్ ఎం. కరుణానిధి ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు, వైద్యుల నుంచి వివరాలు సేకరించారు.

దేవుడు దీవెనలు

దేవుడు దీవెనలు

డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆదేవుడిని ప్రార్థించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీడియాకు చెప్పారు. కరుణానిధిని తాము ఐసీయూలో చూశామని, ఆయనకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మీడియాకు వివరించారు.

కావేరీ ఆసుపత్రి క్లారిటీ

కావేరీ ఆసుపత్రి క్లారిటీ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఆయన ఆరోగ్యం కుదటపడుతోందని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని కావేరీ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మీడియాకు చెప్పారు.

నాయకుల ఆందోళన

నాయకుల ఆందోళన

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఆరోగ్యం విషమించిందని ప్రచారం జరగడంతో డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు కావేరీ ఆసుపత్రి దగ్గర భారీగా గుమికూడారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ ఆసుపత్రి ముందే అనేక మంది కార్యకర్తలు తలనీలాలు సమర్పించుకున్నారు.

తమిళనాడులో హై అలర్ట్

తమిళనాడులో హై అలర్ట్

కరుణానిధి ఆరోగ్యం విషమించిందని ప్రచారం జరగడంతో చెన్నై నగరంతో పాటు తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. పుకార్లు నమ్మకూడదని, కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు కార్యకర్తలకు చెప్పారు. కావేరీ ఆసుపత్రి దగ్గర గుమికూడిన కార్యకర్తలు వెంటనే ఇంటికి వెళ్లాలని కరుణానిధి కుటుంబ సభ్యులు మనవి చేసినా వారు మాత్రం అక్కడి నుంచి కదలలేదు.

English summary
Tamil Nadu Chief Minister Edappadi Palanisami says Karunanidhi is well. We saw him in ICU. Doctors monitoring him continuesly he said further.MK Stalin appealed to his party workers to cooperate with the police and not cause disturbances as DMK president Karunanidhi is reportedly recovering post a health scare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X