వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు గంటల ముందే గుండెపోటు గుర్తించవచ్చు, 10 తరగతి బాలుడి అద్బుతం, రాష్ట్రపతి అవార్డు !

ఆరు గంటల ముందే గుండెపోటు గుర్తించ వచ్చు.తమిళనాడు బాలుడి అద్బత ప్రతిభ, రాష్ట్రపతి అవార్డు..చదివేది 10 తరగతి, బాలుడికి లేఖ రాసిన తమిళనాడు సీఎం

|
Google Oneindia TeluguNews

చెన్నై/క్రిష్ణగిరి: గతంలో వృద్దులకు మాత్రమే గుండెపోటు వచ్చేది. నేడు యుక్త వయసు వారికి గుండెపోటు సమస్య ఎదరౌతోంది. గుండె పోటు మహమ్మారి ఏ క్షణంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ తాను, కని పెట్టిన ఆపరికరం ద్వారా ఆరుగంటల ముందే ఈ ప్రమాదాన్ని పసిగట్టవచ్చని అంటున్నాడు తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన ఆకాశ్‌ మనోజ్‌.

తమిళనాడులోని క్రిషగిరికి చెందిన ఆకాష్‌ మనోజ్ కు పదహారేళ్లు. ఆకాష్ మనోజ్ క్రిష్ణగిరిలో పదో తరగతి చదువుతున్నాడు. గుండెపోటు వచ్చే సూచనను తాను కనిపెట్టిన కొత్త పరికరం ద్వారా తెలుసుకోవచ్చని ఆకాష్ మనోజ్ చెప్పాడు. ఈ పరికరం కనిపెట్టిన ఆకాశ్‌ మనోజ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు.

TN CM lauds Krishnagiri teenager for his device to predict Silent heart attack

ఈ సందర్భంగా ఆ కాష్ మనోజ్ రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ నిశ్శబ్దంగా వచ్చే గుండెపోట్లు ఈ కాలంలో ఎక్కువైపోయాయని అన్నాడు. పైకి చాలా మంది ఆరోగ్యంగగా కనపడతారని, గుండెపోటుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలూ వారిలో కనిపించవని గుర్తు చేశాడు.

మా తాతయ్య ఆరోగ్యంగా కనిపించేవారు కానీ, ఓ రోజు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించారని అన్నాడు. తాతయ్య మరణం నన్ను బాగా కలిచి వేసిందని ఆకాష్ మనోజ్ చెప్పారు. గుండెపోటును ముందే కనిపెట్టే పరికరం ఏదైనా తయారు చేయాలనుకున్నాని అకాష్ మనోజ్ అన్నాడు.

అందులో భాగంగానే ఈ పరికరాన్ని తయారు చేశానని, అయితే దీనిని మరింత అభివృద్ధి పరచాల్సి ఉందని, శరీరంపై ఎలాంటి గాయం చేయకుండా దీనిని ఉపయోగించవచ్చని ఆకాష్ మనోజ్ చెప్పాడు. రక్తంలో ఉండే ఎఫ్ ఏపీ 3 అనే చిన్న ప్రోటీన్ ను ఉపయోగించి గుండెపోటు ప్రమాదాన్ని కనిపెట్టవచ్చు అని ఆకాష్ మనోజ్ చెప్పాడు. అకాష్ మనోజ్ విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అతన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖ రాసి పంపించారు. చెన్నై వచ్చినప్పుడు తనను కలవాలని ఎడప్పాడి పళనిసామి ఆకాష్ మనోజ్ కు సూచించారు.

English summary
Tamil Nadu chief minister Edappadi K Palaniswami has heaped laurels on a teenager from Krishnagiri in the state, who has been awarded gold medal by the president of India for developing a device that can detect silent heart attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X