వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ గాంధీ హత్య: 25 ఏళ్లు జైల్లో పెరారివలన్, విడుదలకు చర్యలు: పళనిసామి !

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు పెరారివలన్ ను త్వరలో జైలు నుంచి పెరోల్ మీద విడుదల చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు పెరారివలన్ ను త్వరలో జైలు నుంచి పెరోల్ మీద విడుదల చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాజీవ్ గాంధీ హత్య కేసులోని నిందితుడిని విడుదల చెయ్యడానికి తమిళనాడు ప్రభుత్వం న్యాయనిపుణలుతో చర్చించడానికి సిద్దం అయ్యింది.

<strong>మళయాలం హీరో దిలీప్ మీద కేసు నమోదు: సోషల్ మీడియాలో నటి మీద నీచంగా !</strong>మళయాలం హీరో దిలీప్ మీద కేసు నమోదు: సోషల్ మీడియాలో నటి మీద నీచంగా !

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టు అయిన పెరారివలన్ గత 25 ఏళ్ల నుంచి తమిళనాడ- ఆంధ్రపద్రేశ్ సరిహద్దులోని వేలూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. పెరారివలన్ ను పెరోల్ మీద విడుదల చెయ్యడానికి సహకరించాలని ఆమె తల్లి ఇటీవల తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ను కలిసి మనవి చేశారు.

TN CM Palanisamy ensured that his govt will consider Perarivalan parole.

పెరారివలన్ ను పెరోల్ మీద విడుదల చేసే విషయంలో తమిళనాడు అసెంబ్లీలో శనివారం చర్చ జరిగింది. ఇదే సందర్బంలో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ మాట్లాడుతూ పెరారివలన్ ను పెరోల్ మీద విడుదల చేసే విషయంలో ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.

<strong>అక్కా, చెల్లి పెళ్లి: టీవీలో అక్క ముఖం గుర్తు పట్టిన కంపెనీ, ఉద్యోగం ఊడింది, ప్రపంచంలో !</strong>అక్కా, చెల్లి పెళ్లి: టీవీలో అక్క ముఖం గుర్తు పట్టిన కంపెనీ, ఉద్యోగం ఊడింది, ప్రపంచంలో !

ఈ సందర్బంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సమాధానం ఇస్తూ పెరారివలన్ మనవిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, న్యాయనిపుణులు, హోంశాఖ అధికారులతో చర్చించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెరారివలన్ ను పెరోల్ మీద విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

English summary
Palanisamy informed assembly after opinion from senior lawyer perarivalan will be granted parole
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X