వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వంకు కీలక పదవి, ఆయన వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, ఓకే నా ? సీబీఐతో !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు పన్నీర్ సెల్వం వర్గంతో విలీనం అయితే మనకే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు పన్నీర్ సెల్వం వర్గంతో విలీనం అయితే మనకే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు.

శశికళ ఫ్యామిలీ మీద బాంబు వేసిన సీఎం: దినకరన్ విషయంలో ఏకగ్రీవ తీర్మానం, ఫినిష్ !శశికళ ఫ్యామిలీ మీద బాంబు వేసిన సీఎం: దినకరన్ విషయంలో ఏకగ్రీవ తీర్మానం, ఫినిష్ !

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నుంచి టీటీవీ దినకరన్ ను బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను పార్టీ నుంచి బహిష్కరించే విషయంలో జోరుగానే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పన్నీర్ సెల్వంతో విలీనం కావాలని చర్చ జరిగింది.

TN CM Palanisamy is in Party Office to discuss various issues including AIADMK merger.

పన్నీర్ సెల్వం వర్గంలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, అన్నాడీఎంకే పార్టీ అడ్వజరీ కమిటీ కార్యదర్శి పదవి పన్నీర్ సెల్వంకు ఇవ్వాలని పలువురు సీనియర్ మంత్రులు సీఎంతో చర్చించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పళనిసామి ప్రతిపాదనలకు పన్నీర్ సెల్వం అంగీకరిస్తారా ? అనే విషయం వేచిచూడాలి.

జైల్లో శశికళ కర్మకాండ, సీసీ టీవీ క్లిప్పింగ్, మాజీ ఐఏఏస్ నివేదిక, చిక్కుల్లో చిన్నమ్మ?జైల్లో శశికళ కర్మకాండ, సీసీ టీవీ క్లిప్పింగ్, మాజీ ఐఏఏస్ నివేదిక, చిక్కుల్లో చిన్నమ్మ?

గురువారం చెన్నైలో పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ. మునిస్వామి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా పళనిసామి వర్గం కళ్లు తెరచి టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అదే విధంగా జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యాలని కేపీ. మునిస్వామి డిమాండ్ చేశారు.

English summary
Edappadi Palanisamy is in Party Office to discuss various issues including AIADMK merger. EPS team is in proposal to give 2 minister post for OPS team MLAs and AIADMK's advisory secretary post to O Panneerselvam?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X