వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళని, పన్నీర్ సుదీర్ఘ చర్చలు, శశికళ మంత్రులకు మంగళం, చిన్నమ్మ గ్యాంగ్ కు షాక్, పార్టీలో !

అన్నాడీఎంకే పార్టీ మీద మరింత పట్టు సాధించిన పన్నీర్ సెల్వంపార్టీలో శశికళ అనుచరులకు నో చాన్స్, పళనిసామి, పన్నీర్ సెల్వం చర్చలుచిన్నమ్మకు మద్దతుగా మాట్లాడిన మంత్రులకు మంగళం, అప్పుడే మొదలైయ్యింది

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీలో పూర్తిగా మార్పులు చేర్పులు చెయ్యాలని నిర్ణయించారు. శశికళ, టీటీవీ దినకరన్, వారి బంధువులకు మద్దతు ఇచ్చే ఎవ్వరినీ పార్టీలో పెట్టరాదని, కొందరు మంత్రులకు మంగళం పాడాలని పక్కా ప్లాన్ వేస్తున్నారని తెలిసింది.

అన్నాడీఎంకే పార్టీ మాదే, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ మా నాయకుడు అంటూ పన్నీర్ సెల్వం వర్గం భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు ఇచ్చింది. శశికళ వర్గం ఇచ్చిన అఫిడవిట్లు పక్కన పెట్టిన ఎన్నికల కమిషన్ గురువారం అన్నాడీఎంకే పార్టీకి ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, ఆయన నాయకత్వంలోని పార్టీ అసలైనదని తేల్చి చెప్పింది.

TN CM Palanisamy and Panneerselvam held discuss over the changes in the AIADMK party.

భారత ఎన్నికల అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పార్టీ మీద పన్నీర్ సెల్వం వర్గానికి మరింత పట్టు వచ్చింది. ఈ సందర్బంలో పార్టీలోని కీలకపదువుల్లో ఉన్న శశికళ మద్దతుదారులకు మంగళం పాడాలని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది.

ఇంతకాలం శశికళ, టీటీవీ దినకరన్ కు మద్దతుగా మాట్లాడిన కొందరు మంత్రులను సైతం మంత్రి వర్గం నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం చర్చలు మొదలు పెట్టారని తెలిసింది. గురువారం సాయంత్రం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం, పార్టీ సీనియర్ నాయకులు, కొందరు మంత్రులు ఈ విషయాలపై చర్చలు మొదలు పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి..

English summary
Tamil Nadu Chief Minister Edappadi Palanisamy and O Panneerselvam held discuss over the changes in the party. Now O.Pannerselvam faction gets more power as EC allot two leaves symbol to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X