వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆట మొదలైంది: పన్నీర్ అవినీతి చిట్టా ఇవ్వండి: ఐఏఎస్ లకు సీఎం ఆదేశాలు !

ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి హోదాలో పన్నీర్ సెల్వం ఆరేళ్ల కాలం పదవిలో ఉన్నారు. ఆ సమయంలో పన్నీర్ సెల్వం అవకతవకలపై శాఖల వారిగా జాబితాను సిద్దం చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అధికార

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే వైరివర్గాల విలీనం ఎండమావేవనని మరోసారి తేలిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గపోరు ఎంత వరకు దారితీస్తోందో అంటూ ఆందోళన చెందుతున్నారు.

దినకరన్ మీద మరో కేసు నమోదు: దరిద్రం అదృష్టం పట్టుకున్నట్లు పట్టుకుంది!దినకరన్ మీద మరో కేసు నమోదు: దరిద్రం అదృష్టం పట్టుకున్నట్లు పట్టుకుంది!

మరోవైపు కడుపులో కత్తులు పెట్టుకుని కలిసిపోదాం అంటూ ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు చర్చలకు పిలుస్తున్నారని పన్నీర్ సెల్వం వర్గం మండిపడుతోంది. ఈనేపథ్యంలో సీఎం ఓ అడుగు ముందుకు వేసి పన్నీర్ సెల్వం ఆరేళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎంత అవినీతికి పాల్పడ్డాడు అనే చిట్టా తయారు చేసే పనిలోపడ్డారు.

గత్యంతరం లేక

గత్యంతరం లేక

జయలలిత మరణం తరువాత రెండు వర్గాలుగా చీలిపోయిన అన్నాడీఎంకే నాయకులు ఎన్నికల కమిషన్ దగ్గర చిక్కుకున్న ఆ పార్టీ రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి గత్యంతరం లేక ఒక్కటి కావాలని సిద్దం అయ్యారు. అయితే ఇరు వర్గాల ఆరోపణలు ప్రత్యారోపణలతో విలీనం చర్చలు అటకెక్కాయి.

 పన్నీర్ సెల్వం ఎదురుదాడి

పన్నీర్ సెల్వం ఎదురుదాడి

విలీనం చర్చలు జరుగుతున్నా మరో వైపు ఎడప్పాడి పళనిసామి తీరుపై పన్నీర్ సెల్వం తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టానికి ఈనెల 5 నుంచి జులై నెల వరకు రాష్ట్ర పర్యటన చెయ్యడానికి పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు.

పళనిసామి పక్కా ప్లాన్

పళనిసామి పక్కా ప్లాన్

ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి హోదాలో పన్నీర్ సెల్వం ఆరేళ్ల కాలం పదవిలో ఉన్నారు. ఆ సమయంలో పన్నీర్ సెల్వం అవకతవకలపై శాఖల వారిగా జాబితాను సిద్దం చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మెజారిటీ మావైపు ఉంటే పన్నీర్ ఏం ?

మెజారిటీ మావైపు ఉంటే పన్నీర్ ఏం ?

122 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు 50 మంది పార్టీ జిల్లా కార్యదర్శులు మా వైపు ఉన్నారని, పన్నీర్ సెల్వం రాజీకి వస్తే ఎంత ? రాకుంటే ఎంత ? అంటూ ఇటీవల బహిరంగ సభలో ఎడప్పాడి పళనిసామి కార్యకర్తలను ఉద్దేశించిమాట్లాడారు. అంటే పన్నీర్ సెల్వంతో రాజీ అయ్యేందుకు ఆయనకు ఇష్టం లేదని సమాచారం.

కేసులో సీఎంను ఇరికించాలని ?

కేసులో సీఎంను ఇరికించాలని ?

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అరెస్టు అయిన టీటీవీ దినకరన్ తో ఎడప్పాడి పళనిసామికి సంబంధం ఉంది అంటూ ప్రచారం చేసి ఆ కేసు సీఎం మెడకు చుట్టడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పన్నీర్ సెల్వం ముందు కుప్పిగంతులా ?

పన్నీర్ సెల్వం ముందు కుప్పిగంతులా ?

పన్నీర్ సెల్వం ముందు కుప్పింగంతులు వెయ్యడానికి ప్రయత్నిస్తే అడ్రస్ లేకుండా పోతారని ఆయన వర్గంలోని నాయకులు పళనిసామి వర్గీయులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. విలీనం చర్చలు మొదలుపెట్టడానికి రెండు డిమాండ్లు అంగీకరించకుండా ఇప్పటికీ శశికళ కాళ్ల మీద పడుతున్నారని పన్నీర్ వర్గం మండిపడుతోంది.

 దమ్ముంటే విచారణ చేసుకోండి

దమ్ముంటే విచారణ చేసుకోండి

ఆరేళ్ల పాటు ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో పన్నీర్ సెల్వం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఆ విషయం ఎడప్పాడి పళనిసామి వర్గానికి తెలుసని, ఒకవేళ విచారణ చేయిస్తే చెయ్యనివ్వండి, మా నాయకుడు నిప్పు, ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు అంటున్నారు.

English summary
Panneerselvam or, the former Chief Minister of the state, will on Friday begin touring the state to build support ahead of crucial local body elections due by July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X