దినకరన్ హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు, మిగిలిన వారు వెళ్లిపోతారని మన్నార్ గుడి మాఫియా?
చెన్నై: తమిళనాడు ప్రభుత్వాన్ని కుప్పకూల్చేస్తా అంటూ బెదిరింపులకు దిగిన శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. 37 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని విర్రవీగిన దినకరన్ కు 20 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు.
420, ఫోర్జరీ ఎవరో ప్రపంచానికే తెలుసు, మోడీ ఇంటి ముందే శశికళ ఫ్యామిలీకి సీఎం వార్నింగ్!
కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీటీవీ దినకరన్ కు విశ్వాసం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం విలీనం దశగా అడుగులు వేస్తున్న సమయంలో దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు చిన్నగా జారుకుంటున్నారు.

తనకు విశ్వాసం ప్రకటించిన ఎమ్మెల్యేలు జారిపోకుండా టీటీవీ దినకరన్ రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. విలీనం కోసం తాను ఇచ్చిన 60 రోజుల గడుపు ఈనెల 5వ తేదీతో ముగిసిపోవడంతో దినకరన్ అన్నాడీఎంకే పార్టీకి కొత్త కార్యవర్గం ప్రకటించారు.
ఢిల్లీలో మకాం వేసిన పళనిసామి, పన్నీర్ సెల్వం, రాజీ కోసం బీజేపీ పెద్దలు, కలిసి చెన్నైకి!
అందులో 19 మంది ఎమ్మెల్యేలకు కీలకపదవులు ఇచ్చినా ఇద్దరు ఎమ్మెల్యే మాకు ఆ పదవులు వద్దు అంటూ పళనిసామి వర్గంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్బంలో తన వెంట ఉన్న 17 మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాలని టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.