వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: స్నానం చేస్తోంటే గవర్నర్ చూశారు, ఖండించిన రాజ్ భవన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తాను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్‌రూమ్‌లోకి తొంగి చూశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం కల్గించింది.అయితే ఈ ప్రచారాన్ని తమిళనాడు రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారాన్ని రాజ్‌భవన్ వర్గాలు కొట్టిపారేశాయి.

మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు చోటు చేసుకొంటున్న ఘటనలు చూస్తున్నాం. అయితే గవర్నర్ ఓ మహిళ స్నానం చేస్తున్న సమయంలో బాత్‌రూమ్‌లోకి తొంగిచూశారని మీడియాలో వచ్చిన కథనాలు సంచలనం కల్గించాయి. అయితే ఈ ఘటనపై కడలూరు జిల్లాలో ఆందోళనలు చోటు చేసుకొన్నాయి.

స్పానం చేస్తోంటే గవర్నర్ బాత్‌రూమ్‌లోకి తొంగి చూశారు

స్పానం చేస్తోంటే గవర్నర్ బాత్‌రూమ్‌లోకి తొంగి చూశారు

నేను స్నానం చేస్తుండగా గవర్నర్‌ బాత్‌రూమ్‌లోకి తొంగి చూశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోండని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.

అసలు ఏం జరిగిందంటే?

అసలు ఏం జరిగిందంటే?


క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం.. వీధివీధి, ఇల్లిల్లూ తిరుగుతూ పరిస్థితులను తెలుసుకొనే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళుతూ.. పక్కనున్న మరుగుదొడ్డిలోకి తొంగిచూశారు. లోపల ఓ మహిళ స్నానం చేస్తుండటంతో క్షణంలో వెనుకడుగువేశారని బాధితురాలు ఆరోపిస్తోంది.

గవర్నర్‌పై ఫిర్యాదు

గవర్నర్‌పై ఫిర్యాదు

గవర్నర్‌ చర్యకు షాక్‌ తిన్న మహిళ కాసేపటికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించిన గవర్నర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో గవర్నర్‌ వెంట కడలూరు కలెక్టర్‌, అధికార ఏఐడీఎంకేకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు గవర్నర్‌ పర్యటనను నిరసిస్తూ ప్రతిపక్ష డీఎంకే కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది.

ఆరోపణలను ఖండించిన రాజ్‌భవన్

ఆరోపణలను ఖండించిన రాజ్‌భవన్


మహిళ చేసిన ఆరోపణలపై తమిళనాడు రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్ భవన్ అభిప్రాయపడింది. గవర్నర్ క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో మహిళా అధికారి కూడ ఆయన వెంట ఉన్నారని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. అంతేకాదు మహిళాధికారి ముందు వెళ్ళిన తర్వాతే గవర్నర్ ఆమెను అనుసరించినట్టు రాజ్ భవన్ ప్రకటించింది.

English summary
Tamil Nadu Governor Banwarilal Purohit's office on Friday termed as "mischievous and scurrilous" media reports that he entered an occupied bathroom in Cuddalore district during a review of toilets built under the Swachh Bharat Abhiyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X