వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ విద్యాసాగర్ రావ్ భేటీ: ఏం చేస్తారో !

తమిళనాడు ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు. గురువారం ఢిల్లీలోని రాజ్ నాథ్ సింగ్, సీహెచ్. విద్యాసాగర్ రావ్ చర్చలు జరపనున్నారు.

శశికలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ: చిన్నమ్మ బెంగళూరు సెంట్రల్ జైల్లోనే ఉండాలిశశికలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ: చిన్నమ్మ బెంగళూరు సెంట్రల్ జైల్లోనే ఉండాలి

దేశ వ్యాప్తంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం అయిన కొన్ని గంటలకు దినకరన్ రూపంలో ప్రభుత్వానికి ముప్పు వచ్చింది. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.

TN Governor Vidyasagar Rao meet Rajanath Singh

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ తమిళనాడు రాజకీయాల గురించే చర్చించనున్నారని తెలిసింది. మైనారిటీలో పడిపోయిన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బలపరీక్షకు అవకాశం ఇవ్వాలా ? వద్దా ? అని చర్చించనున్నారు.

రిసార్ట్ లో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు: చెప్పులతో కొట్టిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రక్షణ !రిసార్ట్ లో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు: చెప్పులతో కొట్టిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రక్షణ !

ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని స్పష్టంగా తెలుస్తున్నందున ప్రభుత్వాన్ని రద్దు చేసి మరలా ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియకు ఆదేశాలు జారీ చెయ్యడమా అనే విషయంలో గవర్నర్ గురువారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిపిన తరువాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ పళనిసామి, పన్నీర్ సెల్వం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బలపరీక్షకు గవర్నర్ అవకాశం ఇవ్వకుంటే ఎమ్మెల్యేలే కోర్టుకు వెళ్లి బలపరీక్షకు ఆదేశాలు తెచ్చుకునే అవకాశం ఉందని తమిళనాడు అసెంబ్లీ మాజీ కార్యదర్శి సెల్వరాజ్ అంటున్నారు.

English summary
TN incharge Governor Vidyasagara Rao is all set to meet Home minister Rajnath Singh to discuss about TN situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X