చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus Lockdown: బంపర్ ఆఫర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్, బీరువా, వామ్మో !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు దేశం మొత్తం Lockdown అయ్యింది. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా ప్రజలు ఎవ్వరూ బయటకు రాకూడదని, ఏప్రిల్ 14వ తేదీ అర్దరాత్రి వరకు ప్రజలు సహకరించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు. ఇదే సమయంలో తమిళనాడు అటవీ శాఖా మంత్రి దిండుగల్ శ్రీనివాస్ ఆయన నియోజక వర్గం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరైతే లాక్ డౌన్ విజయవంతం చేసి ఇళ్లకే పరిమితమై జాగ్రత్తగా ఉంటారో వారికి ఖరీదైన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, కుక్కర్ లు, బీరువాలు తదితర బహుమతులు ఇస్తానని ప్రకటించారు. మంత్రివర్యులు ప్రకటించిన వేల రూపాయల విలువైన బహుమతులు మహిళలకు ఎంతో ఇష్టమైనవి కావడంతో ఆయన నియోజక వర్గంలో ఆడపడుచులు ప్రస్తుతం ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

 దిండుగల్ అంటేనే స్పెషల్

దిండుగల్ అంటేనే స్పెషల్

తమిళనాడు అటవీ శాఖా మంత్రి దిండుగల్ శ్రీనివాస్ ఎప్పుడూ వినూత్నంగానే పని చేస్తుంటారు. తమిళనాడు ప్రభుత్వంలో దిండుగల్ శ్రీనివాస్ చాలా ప్రత్యేకమైన మంత్రి. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం, వివాదాల్లో చిక్కుకోవడం దిండుగల్ శ్రీనివాస్ కు కొత్త ఏమీకాదు. రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాటల తూటాలు పేల్చడం, తరువాత తన తప్పులో కాలేసినట్లు తెలిసి ఆ విషయాలను దాటవెయ్యడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

 కరోనా కోసం లాక్ డౌన్

కరోనా కోసం లాక్ డౌన్

కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన ప్రజలు ఇష్టానుసారంగా రోడ్ల మీదకు వస్తున్న సమయంలో కొందరు మంత్రులు వారి మీద కస్సుబస్సు మంటున్నారు. అయితే అలాంటి వారి మీద మంత్రి దిండుగల్ శ్రీనివాస్ ఇంత వరకు నోరుపారేసుకోలేదు.

 ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, కుక్కర్లు బీరువాలు

ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, కుక్కర్లు బీరువాలు

తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాస్ చెన్నైలోని అనేక ప్రాంతాలతో పాటు ఆయన నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. తాను చెప్పినట్లు ఎవరెవరు వింటారో వాళ్లు ఖరీదైన వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్ లు, బీరువాలు, కుక్కర్ లతో పాటు ఖరీదైన వస్తులు బహుమతులుగా పొందే అవకాశం ఉందని మంత్రి దిండుగల్ శ్రీనివాస్ ప్రజలకు చెప్పారు. అయితే లాక్ డౌన్ సమయంలో తాను చెప్పిన కొన్ని నియమాలు పాటించాలని మంత్రి దిండుగల్ శ్రీనివాస్ అన్నారు.

ఇలా చెయ్యండి, మీ ఇంట్లో అన్నీ !

ఇలా చెయ్యండి, మీ ఇంట్లో అన్నీ !

కరోనా వైరస్ ను అరికట్టడానికి అందరూ లాక్ డౌన్ ను విజయవంతం చెయ్యాలని మంత్రి దిండుగల్ శ్రీనివాస్ చెప్పారు. తన నియోజక వర్గంలోని ప్రజలు ఇంటి గడప దాటకుండా ఇంట్లోనే ఉంటారో వారు తాను చెప్పిన బహుమతులు అన్నీ వారు సొంతం చేసుకోవచ్చని మంత్రి దిండుగల్ శ్రీనివాస్ అన్నారు.

 నా మనుషులు వస్తారు జాగ్రత్త !

నా మనుషులు వస్తారు జాగ్రత్త !

నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి తన మనుషులు నిత్యవసర వస్తువులు తీసుకుని వస్తారని, ఎవరైతే ఇంటిలో నుంచి కాలు బయట పెట్టకుండా ఆ వస్తువులు తీసుకుంటారో వారి పేర్లు నమోదు చేసుకుంటారని అన్నారు. తన మనుషులు నియోజక వర్గం మొత్తం తిరుగుతారని, ఎవరైతే లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజు 24 గంటలు ఇళ్లకే పరిమితం అవుతారో వారి పేర్లు నమోదు చేసుకుని వారి పేర్లు లక్కీడిప్ ద్వారా ఖరీదైన కానుకలు అందిస్తామని మంత్రివర్యులు దిండుగల్ శ్రీనివాస్ ప్రకటించారు.

 తెలివైన మంత్రి అంటే ఈయనే !

తెలివైన మంత్రి అంటే ఈయనే !

మంత్రి దిండుగల్ శ్రీనివాస్ జోబు నుంచి చిల్లగవ్వ జారకుండా జాగ్రత్త పడి మొత్తం బహుమతులు చెన్నై కార్పొరేషన్ నుంచి అందించడానికి పక్కాప్లాన్ వేసుకున్నారు. అయితే ఇదే సమయంలో ఎప్పుడూ చెప్పినమాట మీద నిలబడని వ్యక్తిగా పేరు ఉన్న మంత్రి దిండుగల్ శ్రీనివాస్ ఈ సారైనా చెప్పిన మాట నిలబెట్టుకుంటారా ? లేదా ? అనే విషయం కొన్ని రోజులు వేచి చూడాలి అంటున్నారు తమిళ తంబీలు.

English summary
Coronavirus Lockdown: Tamil Nadu Minister Dindigul Srinivasan says that bumper prize will be given to those who follows Social distancing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X