వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1957 నుంచి 12సార్లు గెలిచిన కరుణానిధి, రికార్డ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకున్నారు. మే 16వ తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 92 ఏళ్ల కరుణానిధి పోటీ చేస్తున్నారు.

ఈసారి డీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి కరుణానిధియే. ఇప్పటి వరకు ఆయన అయిదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం అతను తిరువూరు నుంచి బరిలోకి దిగారు. 2011లోను అతను ఇక్కడి నుంచే పోటీ చేసి 50,249 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కరుణానిధి 12 ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క దాంట్లోను ఓడిపోకుండా రికార్డ్ సృష్టించారు. తొలిసారి 1957లో కరుణానిధి పోటీ చేశారు. అప్పుడు, తన 33 ఏళ్ల వయస్సులో కులితలై నుంచి కరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన పోటీ చేసిన 12 ఎన్నికల్లోను గెలిచారు.

గత 12సార్లు కరుణానిధి పోటీ చేసిన నియోజకవర్గాలు ఇవే..

1957లో కరుణానిధి కులిత్తలై నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఏ ధర్మలింగంను 8,296 ఓట్లతో ఓడించారు.

1962లో తంజావూరు నుంచి పోటీ చేశారు. 20,482 ఓట్ల తేడా

TN polls: M Karunanidhi has won all 12 contests so far, two by a whisker
తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్జీ వినాయకమూర్తిని ఓడించారు.

1971లో సైదాపేట నుంచి పోటీ చేశారు. 12,511 ఓట్లతో కాంగ్రెసక్ పార్టీ అభ్యర్థి కామలింగంను ఓడించారు.

1977లో అన్నానగర్ నుంచి పోటీ చేశారు. 16,438 ఓట్లతో అన్నాడీఎంకే అఏభ్యర్థి జీ కృష్ణమూర్తిని ఓడించారు.

1980లో అన్నానగర్ నుంచి మరోసారి పోటీ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి హెచ్‌వీ హాండేను 699 ఓట్ల తేడాతో ఓడించారు.

1984లో కరుణానిధి పోటీ చేయలేదు.

1989లో హార్బర్ నుంచి పోటీ చేశారు. ముస్లీం లీగ్ అభ్యర్థి కేఏ వాహబ్ పైన 31,991 ఓట్లతో గెలుపొందారు.

1991లో హార్బర్ నుంచి పోటీ చేశారు. 890 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కే సప్పును ఓడించారు.

1996లో చెపాక్ నుంచి పోటీ చేశారు. 35,784 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎస్సెస్ నెల్లై కన్నన్‌ను ఓడించారు.

2001లో చెపాక్ నుంచి మరోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ దామోదరన్‌ను 4,834 ఓట్ల తేడాతో ఓడించారు.

2006లో చెపాక్ నుంచి పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థి డీ మిఖాన్‌ను 8,526 ఓట్ల తేడాతో ఓడించారు.

2011లో తిరువూర్ నుంచి పోటీ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఎం రాజేంద్రన్‌ను 50,249 ఓట్ల తేడాతో ఓడించారు.

English summary
M Karunanidhi will contest the 13th Assembly election of his life on May 16 when Tamil Nadu will go to the polls. The DMK supremo and five-time chief minister of the southern state will contest from Tiruvarur, from where he had contested in 2011 and won by a record 50,249 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X