వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TNPSC Jobs Scam: కట్టప్ప కాదు నాగప్ప, రూ, కోట్లు నామం, సినిమా స్టార్స్, మోడల్స్ తో ఎంజాయ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ రామనాథపురం: పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యుత్ బోర్డు, సచివాలయం ఇలా ఏ శాఖ కావాలో చెప్పండి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను నమ్మించాడు. బాహుబలి సినిమాలో మహిష్మతి రాజకుటుంభానికి కట్టప్ప ఎంత నమ్మకస్తుడో నిరుద్యోగులకు ఈ నాగప్ప అంత నమ్మకస్తుడు, నన్ను నమ్మండి అంటూ మాయమాటలు చెప్పాడు. తాను సచివాలయంలో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నాను, నేను చెప్పినంత నగదు మీరు ఇస్తే మీరు కోరుకున్న శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నకిలీ ఐఏఎస్ అధికారి నిరుద్యోగులకు తియ్యటిమాటలు చెప్పాడు. నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యుల దగ్గర రూ. కోట్లు వసూలు చేసిన నకిలీ ఐఏఎస్ అధికారి సినిమా స్టార్స్ (నటీమణులు). టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ ను స్టార్ హోటల్స్, రిసార్టులు, పబ్ లకు తీసుకెళ్లి జల్సాలు చేశాడు. చివరికి ఈ మాయలోడు నాగప్ప పోలీసులకు చిక్కడంతో బెండ్ తీస్తున్నారు.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

బాహుబలి కట్టప్ప కాదు నాగుపాము నాగప్ప

బాహుబలి కట్టప్ప కాదు నాగుపాము నాగప్ప

తమిళనాడులోని రామనాథపురంలో నాగప్ప (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తాను తమిళనాడు సచివాలయంలో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నానని నాగప్ప పరిసర ప్రాంతాల ప్రజలను నమ్మించాడు. విలాసవంతమైన సైరన్ కారులో (కారు పైన ఎర్ర లైట్) తిరుగుతున్న నాగప్ప దగ్గర తమిళనాడు సచివాలయం ఎంట్రీ పాస్ లు, అనేక శాఖల పాస్ లకు చెందిన స్టాంప్ లు, ఐఏఎస్ అధికారి అంటు గుర్తింపు కార్డులు, విజిటింగ్ కార్డులు ఉండటంతో అమాయక ప్రజలు అతను నిజంగా ఐఏఎస్ అధికారి అని నమ్మిపోయారు.

రిటైడ్ టీచర్ డైసీ

రిటైడ్ టీచర్ డైసీ

రామనాథపురంలో డైసీ అనే మహిళ కాపురం ఉంటున్నారు. డైసీ, ఆమె భర్త ప్రభుత్వ ఉపాద్యాయులుగా పని చేస్తూ రిటైడ్ అయ్యారు. ఎలాగైనా తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డైసీ చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఓ సారి కాలాంతకుడు నాగప్ప తాను ఐఏఎస్ అధికారి అంటూ రిటైడ్ టీచర్ డైసీకి పరిచయం అయ్యాడు. తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని డైసీ నాగప్పకు మనవి చేశారు.

మూడు ఉద్యోగాలు రూ. 75 లక్షలకు డీల్

మూడు ఉద్యోగాలు రూ. 75 లక్షలకు డీల్

డైసీ కుమారుడు, అల్లుడు, మరో బంధువుకు ఉద్యోగాలు ఇప్పించాలని డైసీ నాగప్పకు మనవి చేశారు. అది ఎంతపని, నిమిషాల్లో మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, నన్నునమ్మండి అంటూ డైసీకి నాగప్ప మాయమాటలు చెప్పాడు. మూడు ఉద్యోగాలు ఇప్పించడానికి రూ. 75 లక్షలు డీల్ కుదుర్చుకున్న నాగప్ప అడ్వాన్స్ గా డైసీ దగ్గర రూ. 45 లక్షలు లాక్కొన్నాడు.

సచివాలయంలో హంగామా

సచివాలయంలో హంగామా

డైసీని తమిళనాడు సెక్రటేరియట్ లోకి తీసుకెళ్లిన నాగప్ప అక్కడ కొందరిని ఆమెకు పరిచయం చేశాడు. వీరంతా విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ తదితర శాఖల్లో పని చేస్తున్నారని డైసీకి మాయమాటలు చెప్పి వారిని పరిచయం చేశాడు. మీకు వారం రోజుల్లో అపాయిట్మెంట్ లెటర్ ఇస్తామని, మీరు ధైర్యంగా ఉండాలని నాగప్ప, అతని అనుచరులు డైసీకి మాయమాటలు చెప్పారు.

 తీరికలేని బిజిబిజీ ఆఫీసర్

తీరికలేని బిజిబిజీ ఆఫీసర్

సచివాలయంలో నిమిషం తీరకలేని అధికారిగా నాగప్ప అటూఇటూ తిరగడంతో నిజంగా అతను ఐఏఎస్ అధికారి అని డైసీ పూర్తిగా నమ్మిపోయింది. మీకు ఉద్యోగాలు వచ్చిన తరువాత ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం మిగిలిన రూ. 30 లక్షలు ఇవ్వాలని నాగప్ప డైసీకి చెప్పాడు. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టి ఇస్తానని డైసీ నాగప్పకు హామీ ఇచ్చింది.

రూ. 45 లక్షలు గోవిందా గోవింద

రూ. 45 లక్షలు గోవిందా గోవింద

ఎన్ని రోజులు అయినా తన కుమారుడు, అల్లుడు, బంధువుకు ఉద్యోగాలు రాకపోవడంతో డైసీ ఆందోళన చెందింది. కొన్ని ప్రభుత్వ శాఖల నకిలీ స్టాంప్ లు వేసిన పత్రాలను నాగప్ప, అతని అనుచరులు తీసుకెళ్లి డైసీకి ఇచ్చారు. అసలే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైడ్ అయిన డైసీ ఎంప్లాయ్ మెంట్ రిజిస్టర్ కార్యాలయం ఇచ్చిన నియామక పత్రాలు ఇవ్వాలని నిలదీసింది. ఆ సమయంలో నాగప్పతో పాటు ఆ నకిలీ ఐఏఎస్ అధికారి వెంట వెళ్లిన మరో ముగ్గురు అక్కడి నుంచి కారులో పరారైనారు. డైసీకి అనుమానం వచ్చి రూ. 45 లక్షలు ఇచ్చి మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో నకిలీ ఐఏఎస్ అధికారి నాగప్పను పోలీసులు పట్టుకుని బెండ్ తీశారు.

సినిమా స్టార్స్, మోడల్స్ తో ఎంజాయ్

సినిమా స్టార్స్, మోడల్స్ తో ఎంజాయ్

నిరుద్యోగుల నుంచి రూ. కోట్లు వసూలు చేస్తున్న నాగప్ప కొందరు సినిమా నటీమణులు, టీవీ సీరియల్స్ అమ్మాయిలు, ఆంటీలు, మోడల్స్ ను స్టార్ హోటల్స్, రిసార్టులు, క్లబ్ లు, పబ్ లకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా వారితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో తీసిన వీడియోలను మొబైల్ ఫోన్లలో చూసుకుంటూ మురిసిపోతున్నాడు.

 మాయగాళ్లు మాయం

మాయగాళ్లు మాయం


నాగప్ప అసలు విషయం బయటకు రావడంతో అతని అనుచరులు మాయం అయ్యారు. నాగప్పకు అతని అనుచరులు ప్రకాష్, రెడ్డి ప్రసాద్ అనే వ్యక్తులు సహాయం చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో నాగప్పకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు ఆ కోణంలో విచారణ ముమ్మరం చేశారు.

English summary
TNPSC Jobs scam: Ramnadapuram fake IAS officer arrested for cheating case in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X