వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ వడ్డీ రేట్లు యాథాతథం: 5.15 శాతం వద్దే రెపో రేట్

|
Google Oneindia TeluguNews

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిటరీ పాలసి ప్యానెల్ రెపో రేట్‌ను యథాతథంగా ఉంచింది. 5.15 శాతం వద్దే రెపో రేట్ ఉంది. దేశ ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి జరిగిన పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. ఇక గత 26 త్రైమాసికాలను పరిశీలిస్తే ఎప్పుడూ లేనంతగా తొలిసారిగా దేశ జీడీపీ 4.5శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

To boost Cash flow in Economy, RBI makes sure that Repo rate remains unchanged at 5.15%

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా చాలా మంది నిపుణులు ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ మోనిటరీ ప్యానెల్ రెపో రేట్‌ను తగ్గిస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. అంతేకాదు జీడీపీ వృద్ధి రేటు కూడా 2019-20కి 6.1శాతం నుంచి 5శాతంకు పడిపోతుందని అంచనా వేసింది. ఇక ద్రవోల్బణంలో కూడా కాస్త పెరుగుదల కనిపిస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. 4శాతం ఉన్న ద్రవ్యోల్బణం 4.7 నుంచి 5.1శాతంకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ట స్థాయి 4.62 శాతానికి ఎగబాకిన తరువాత ప్రస్తుతం 4 శాతం నుంచి 4.7-5.1 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు మోనటరీ ప్యానెల్ పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు గాను రెపో రేట్‌ను యథావతథంగా ఉంచినట్టు సమాచారం. మొత్తంగా ఐదు సార్లు వరుసగా రెపో రేట్‌ను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. వరుసగా ఐదు సార్లు తగ్గించడంతో మొత్తంగా 135 బేసిస్ పాయింట్లను తగ్గించినట్లయ్యింది. ఇలా చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహంకు బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుందని ఆర్బీఐ భావిస్తోంది.

English summary
Reserve Bank of India once again cut short its Repo rate for the sixth time Keeping in mind the GDP of the country which fell to 4.5 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X