వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: రూ.1,349కే ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్

రిలయన్స్ జియో‌కు ఎయిర్‌టెల్ చెక్ పెట్టేందుకు ప్లాన్ చేసింది.అతి తక్కువ ధరలోనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సెల్‌కాన్‌ కంపెనీతో కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు రూ. 1,349లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇవ్వ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో‌కు ఎయిర్‌టెల్ చెక్ పెట్టేందుకు ప్లాన్ చేసింది.అతి తక్కువ ధరలోనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సెల్‌కాన్‌ కంపెనీతో కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు రూ. 1,349లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇవ్వనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. అయితే ఈ తరుణంలో జియో‌కు చెక్ పెట్టేందుకుగాను ఎయిర్‌టెల్ కూడ తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసి జియో‌కు చెక్‌పెట్టే ప్రయత్నం చేసింది.

ఎయిర్‌టెల్‌ మెబైల్ తయారు చేసే సెల్‌కాన్‌ కంపెనీతో జత కట్టింది. తక్కువ ధరకే అన్ని హంగులున్న స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయడం మార్కెట్లో సంచలనంగా మారింది.

తక్కువ ధరకే 4జీ ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్

తక్కువ ధరకే 4జీ ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్

రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టేలా త క్కువ ధరలో 4 జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. తన చందాదారులకు అతి తక్కువ ధరకే మొబైల్‌ అందించే వ్యూహంలో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది. సెల్‌కాన్‌ తో కలిసి రూ.1,349 కే స్మార్ట్‌ఫోన్‌ను అందజేయనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' పథకంలో భాగంగా ఫీచర్‌ ఫోన్‌ ధరలోనే స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

అత్యాధునిక హంగులతో ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్

అత్యాధునిక హంగులతో ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్

సెల్‌కాన్‌ స్మార్ట్ 4 జి' మార్కెట్ ధర రూ. 3,500. 4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డ్యూయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్‌ లో గూగుల్‌ ప్లే లోని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌ తదితర అన్ని యాప్‌లకు అనుమతి ఉంది. తక్కువ ధరలో ఈ రకమైన అన్ని ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.అయితే ప్రతి నెల రీఛార్జీ చేస్తే డబ్బులను ఎయిర్‌టెల్ తిరిగి చెల్లిస్తోంది.ఇటీవల కార్బన్ ఎ40 ఇండియన్ పేరిట కేవలం రూ.1399కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎయిర్‌టెల్ విడుదల చేసింది.

 రీ ఛార్జీ చేస్తే డబ్బులిలా వాపస్

రీ ఛార్జీ చేస్తే డబ్బులిలా వాపస్

ఎయిర్‌టెల్‌ తాజాగా సెల్‌కాన్‌తో జతకట్టి మరో 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ సెల్‌కాన్ స్మార్ట్ 4జీ ఫోన్‌ను వినియోగదారులు ముందుగా రూ.2,849 చెల్లించి కొనుగోలు చేయాలి.. ఇందులో నెలకు రూ.169 రీచార్జ్‌ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఇలా నెలకు రూ.169 చొప్పున 36 నెలల పాటు రీచార్జి చేస్తూ ఫోన్‌ను వాడాలి. అలా వాడితే మొదటి 18 నెలలకు రూ.500, తరువాత 36 నెలలకు రూ.1000 వెనక్కి ఇస్తారు. అంటే మూడు సంవత్సరాలకు మొత్తం రూ.1500 వెనక్కి చెల్లించనుంది ఎయిర్‌టెల్. దరిమిలా ఫోన్ ధర కేవలం రూ.1349 మాత్రమే. ఈ ప్లాన్ ద్వారా లోకల్,ఎస్‌టీడీ కాల్స్ అపరిమితం. రోజుకు 500 ఎంబీ 4జీ డేటా ఉచితంగా ఇవ్వనుంది ఎయిర్‌టెల్. అయితే ఈ ప్యాకేజీ 28 రోజుల వరకు మాత్రమే పరిమితం కానుంది.

ప్రత్యామ్నాయ ప్లాన్ ఇలా

ప్రత్యామ్నాయ ప్లాన్ ఇలా


ఒకవేళ రూ .169 రీచార్జ్‌ ఇష్టంలేని వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా ఏ రీఛార్జ్‌ ప్లాన్‌ అయినా వినియోగించుకోవచ్చు. అయితే రూ .500 మొదటి వాపసును క్లెయిమ్ చేసుకొనేందుకుగాను మొదటి 18 నెలల్లో రూ. 3000 విలువ గల రీఛార్జిలు చేసుకోవాలి. అలాగే రూ. 1,000 రిఫండ్‌ కావాలంటే 18 నెలల్లో రూ. 3000 రీఛార్జ్‌ చేయించుకోవాలి.36 నెలలు, మొత్తం రీఛార్జి రూ. 6,000 చేసుకోవాల్సి ఉంటుంది.

English summary
The JioPhone has competition. Rival Airtel has partnered with Celkon under 'Mera Pehla 4G Smartphone' initiative to provide a 4G smartphone for Rs 1,349. The booking amount of effectively free JioPhone is Rs 1,500 and it is mandatory to do Rs 153 recharge per month for 36 months to get the refund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X