వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ ఆర్ ఐ లకు షాక్ :నగదును మార్చుకోవాలంటే అనుమతి పత్రాలు తీసుకోవాల్సిందే

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఎన్ ఆర్ ఐ లు రద్దు చేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకుగాను కస్టమ్స్ అధికారుల అనుమతిని తీసుకోవాల్సిన అవసరం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పెద్ద నోట్లను ఈ ఏడాది జూన్ వరకు మార్చుకోవచ్చని ఎన్ ఆర్ ఐ లకు కేంద్రం ఆఫర్ ఇచ్చింది. అయితే ఆర్థికశాఖ కొత్త మెలిక పెట్టింది.డిపాజిట్ కంటే ముందు కస్టమ్స్ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని ఆర్థికశాఖ తేల్చింది.

ఎన్ ఆర్ ఐ లు ఈ ఏడాది జూన్ వరకు పాత నగదును మార్పిడి చేసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు కల్పించింది.అయితే నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేముందు కస్టమ్స్ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను పొందాలన్నారు.

కస్టమ్స్ అధికారులకు ఇచ్చిన ధృవీకరణ పత్రాల్లో ఎంత డబ్బైతే పేర్కొన్నారో అంతే ఆర్భిఐ శాఖల్లో జమ చేయాలని కోరారు. ప్రస్తుతం ఎన్ ఆర్ ఐలకు,విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ప్రస్తుతం విదేశాలకు వెళ్తున్న వారికి స్పష్టమైన వివరణలో ఇస్తే ఇక్కడే ఉంటున్నవారికి మాత్రమే పాతనోట్లను జమచేసేందుకు అవకాశం ఇస్తున్నారు.

to exchange old notes nris need to get for stamped from customs

విదేశాలకు వెళ్ళే భారతీయులకు అయితే మార్చి 31 వరకు ఎన్ ఆర్ ఐ లకు జూన్ 30వరకు ఆర్ బి ఐ శాఖల్లో డబ్బును డిపాజిట్ ను చేసే అవకాశం ఉంది. విదేశాల నుండి తమ పాత నగదును డిపాజిట్ చేసేందుకు భారత్ కు వచ్చే వారు ఆయా విమానాశ్రయాల్లోనే తొలతు తాము డిపాజిట్ చేసే పాత డబ్బును చూపించాల్సి ఉంటుంది.

అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బును మార్చుకోవాలనే దానిపై పరిమితి లేదు. ఎన్ ఆర్ ఐలు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద 25 వేల రూపాయాలను జమ చేసుకొనే అవకాశం ఉంది.

తాము డిపాజిట్ చేసే పాత నోట్లను ముందే ఎయిర్ పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులకు చూపించి వారి నుండి అనుమతి పత్రాలను తీసుకోవాలి. వారు డబ్బును డిపాజిట్ చేసే ఆర్ బి ఐ శాఖల్లో ఈ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమయంలో తాము విదేశాల్లో ఉన్నామని, ఇదివరకు నోట్లు మార్చుకోలేదని గుర్తింపు పత్రాలు చూపించిన వారికి మాత్రమే ఈ నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.

English summary
to exchange old notes nris need to get for stamped from customs department, at the airport land customs stations etc on entry, customs stamp on the said forms shall be affixed and the same shall be submitted along with other documents to rbi offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X