వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ అక్రమాస్తుల కేసు: శశికళ జైలుకు, కోర్టు ఖర్చులు ఎన్ని కోట్లు తెలుసా !

జయలలిత అక్రమాస్తుల కేసును కోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దేవ్, బివీ, ఆచార్య, జోసెఫ్ అరిస్టాటల్, సందేష్ చౌటె, మధుసూదన్ నాయక్ లకు కర్ణాటక ప్రభుత్వం ఎంత మొత్తంలో ఫీజులు చెల్లించారు .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారని నమోదు అయిన కేసును సుప్రీం కోర్టులో వాదించడానికి కర్ణాటక ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులకు చెల్లించిన ఫీజుల వివరాలు వెలుగు చూశాయి.

బెంగళూరు నగరానికి చెందిన సామాజిక కార్యకర్త టి. నరసింహమూర్తి ఆర్ టీఐ చట్టం కింద తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసును సుప్రీం కోర్టులో వాదించడానికి కర్ణాటక ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనే పూర్తి వివరాలు ఇవ్వాలని అర్జీ సమర్పించారు.

కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ

కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ

జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో మనవి చేసింది.

ఆ న్యాయవాదులు వీరే

ఆ న్యాయవాదులు వీరే

జయలలిత అక్రమాస్తుల కేసును సుప్రీం కోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాదులకు కర్ణాటక ప్రభుత్వం రూ. కోట్లలో ఫీజు చెల్లించింది. సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దేవ్, బివీ, ఆచార్య, జోసెఫ్ అరిస్టాటల్, సందేష్ చౌటె, మధుసూదన్ నాయక్ జయలలిత అక్రమాస్తుల కేసును వాదించారు.

మళ్లీ మొదటి నుంచి

మళ్లీ మొదటి నుంచి

జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఆదాయానికి మించి అక్రమాస్తులు సంసాధించారని ప్రత్యేక కోర్టు వీరికి శిక్ష విధించింది. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టి వేస్తూ జయలలిత తదితరులను నిర్దోషులుగా విడుదల చేసింది.

అదే కేసు

అదే కేసు

జయలలిత తదితరుల శిక్షను రద్దు చేస్తూ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం కోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసింది. సుప్రీం కోర్టులో కేసు వాదించడానికి కర్ణాటక ప్రభుత్వం రూ. 2.79 కోట్లు ఖర్చు పెట్టింది.

సీనియర్ న్యాయవాది బివీ. ఆచార్య

సీనియర్ న్యాయవాది బివీ. ఆచార్య

జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో వాదించిన న్యాయవాదులు అందరికంటే బీవీ. ఆచార్యకు ఎక్కువ మొత్తంలో ఫీజు చెల్లించారు. బీవీ. ఆచార్యకు రూ. 1,06,86,018 ఫీజు చెల్లించామని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

సీనియర్ న్యాయవాదులకు ఎంతంటే ?

సీనియర్ న్యాయవాదులకు ఎంతంటే ?

సుప్రీం కోర్టు తీర్పు వెలువడక ముందే జయలలిత మరణించారు. తరువాత శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలుకు వెళ్లడానికి ప్రధాన కారణం అయిన సీనియర్ న్యాయవాది బీవీ. ఆచార్యకు చెల్లించిన ఫీజు కంటే మిగిలిన న్యాయవాదులకు చెల్లించిన ఫీజులు తక్కువే. న్యాయవాదులు దుష్యంత్ దవె రూ. 95,16,500, జోసెఫ్ అరిస్టాటల్ రూ. 32,01,070, సందేష్ చౌటె రూ. 42,23,643, మధుసూదన్ నాయక్ రూ. 2,43,657 ఫీజు చెల్లించామని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.

మొత్తం రూ. 2. 79 కోట్లు ఖర్చు అయ్యింది

మొత్తం రూ. 2. 79 కోట్లు ఖర్చు అయ్యింది

జయలలిత అక్రమాస్తుల కేసు వాదించడానికి కర్ణాటక ప్రభుత్వం రూ 2.79 కోట్లు ఖర్చు పెట్టిందని కర్ణాటక హైకోర్టు అడ్వకేట్ జనరల్ కార్యాలయం అధికారికంగా వెల్లడించారు. నరసింహమూర్తి సమర్పించిన అర్జీకి హైకోర్టు అడ్వకేట్ జనరల్ కార్యాలయం ఈ పూర్తి వివరాలు వెల్లడించింది. జయలలిత కేసు వాదించినడాకి ఖర్చు పెట్టిన రూ. 2.79 కోట్లను తమిళనాడు ప్రభుత్వం నుంచి వసూలు చేస్తామని కర్ణాటక హైకోర్టు అడ్వకేట్ జనరల్ కార్యాలయం అధికారులు తెలిపారు.

English summary
The information also revealed that advocates Joseph Aristotle and Sandesh Chowta were paid Rs 32,01,070 and Rs 42,23,643 respectively. An amount of Rs 2,43,657 was paid to advocate general of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X