వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా నుంచి నేర్చుకోండి, పాక్‌పై ఓ బాంబు వేయండి: తొగాడియా

అమెరికా నుంచి భారత్ నేర్చుకోవాలని విశ్వహిందూ పరిషత్ లీడర్ ప్రవీణమ తొగాడియా శుక్రవారం అన్నారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను మనం అనుసరించాలని వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా నుంచి భారత్ నేర్చుకోవాలని విశ్వహిందూ పరిషత్ లీడర్ ప్రవీణమ తొగాడియా శుక్రవారం అన్నారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను మనం అనుసరించాలని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌పై ఓ బాంబు వేసి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను విడిపించాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న జిహాదీలపై కూడా ఓ బాంబు వేయాలన్నారు.

pravin togadia

ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్‌ స్థావరాలపై బాంబు దాడులకు ఆదేశించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆయన ప్రశంసించారు. జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొగాడియా పాల్గొన్నారు.

వాషింగ్టన్‌కు దాదాపు పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐసిస్‌ స్థావరాలపై బాంబు దాడి ద్వారా ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ అనే తన విధానాన్ని నిరూపించుకున్నారన్నారు. ఇదే విధానాన్ని భారత్‌ అనుసరించాలన్నారు.

న్యూఢిల్లీకి 800 కి.మీల దూరంలో ఉన్న పాకిస్థాన్‌పై ఓ బాంబు వేసి భారత సైనికులను సురక్షితంగా విడిపించాలన్నారు. భారత ఆర్మీతో యుద్ధం చేస్తున్న ఉగ్రవాదులను కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

వారిపై బాంబు వేసేందుకు ఎలాంటి దయా చూపాల్సిన పని లేదన్నారు. అలసత్వం వహిస్తే శత్రువులు ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తారని దేశాన్ని ముక్కలు చేస్తారని అభిప్రాయపడ్డారు.

రామాలయం గురించి మాట్లాడుతూ.. రాముడు పుట్టిన అయోధ్యలోనే మందిరం నిర్మిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు 'పి'ల మద్దతుతో రామాలయం నిర్మిస్తామన్నారు. ఒకటి ప్రజలు (పీపుల్స్-పి), రెండు పార్లమెంటు (పి), మూడు ప్రధానమంత్రి (ప్రైమినిస్టర్-పి). వీరి మద్దతుతో రామాలయం నిర్మాణం అవుతుందన్నారు.

English summary
Controversial Vishwa Hindu Parishad leader Pravin Togadia on Friday said that India should learn from US President Donald Trump to approach Pakistan in a bid to secure the release of ex-navy officer Kulbhushan Jadhav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X