హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నిక ఏదైనా - ఎక్కడైనా : గెలుపే లక్ష్యం - ఇక ప్రజల్లోనే : ప్రధాని దిశా నిర్దేశం..!!

|
Google Oneindia TeluguNews

ఎన్నికలు ఎక్కడ జరిగినా .. ఏ స్థాయిలో ఎన్నికలైనా గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిందేనని.. పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేసారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు - రానున్న రోజుల్లో వరుసగా పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా తొలి రోజున రాజకీయ అంశాల పైన చర్చ జరిగింది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల పైన అనుసరించాల్సిన వైఖరి పై చర్చ సమయంలో ప్రధాని జోక్యం చేసుకున్నారు. పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధిస్తున్న విధానం గురించి వివరించిన ఆయన.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై మరింత దృష్టి పెట్టి పనిచేయాలని నేతలకు సూచించారు.

నేతలంతా ప్రజల్లోనే ఉండాలి

నేతలంతా ప్రజల్లోనే ఉండాలి


ప్రధానంగా ప్రజల్లోనే ఉండేందుకు నేతలు సమయం కేటాయించాలని స్పష్టం చేసారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పథకాల లబ్ధిదారులను కలుస్తూ, కార్యకర్తలతో మమేకం అవుతూ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్దేశించారు.

పార్టీ చీఫ్ నడ్డా అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశంలో కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను ఖరారు చేసారు. అందులో ప్రధానంగా పథకాలను ప్రజలకు వివరించటం.. అన్ని రాష్ట్రాలకు పార్టీ విస్తరించటం.. రాజకీయ - ఆర్దిక తీర్మానాల పైన అజెండా ఫిక్స్ చేసారు. సమావేశాల్లో తొలి రోజున ఆర్థిక పరిస్థితిపై తీర్మానం తర్వాత ఎన్నికలపై చర్చ జరిగింది. ఇక, కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం గురించి ఆ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు వివరించారు.

గుజరాత్ మోడల్ అనుసరించాలి

గుజరాత్ మోడల్ అనుసరించాలి

అదే విధంగా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలు సైతం తమ సంసిద్దత గురించి చెప్పుకొచ్చారు. ప్రజలతో మమేకం అవ్వటంలో భాగంగా.. ఒక జిల్లాలో మొత్తం యంత్రాంగమంతా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఎన్నికల వరకు అనుసరించనున్న వ్యూహాన్ని గుజరాత్‌ పార్టీ అధ్యక్షుడు వివరించారు. ఈ సమయంలో మోదీ జోక్యం చేసుకొని అన్ని రాష్ట్రాల అధ్యక్షులు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ యంత్రాంగమంతా 24 గంటలపాటు ఒక జిల్లాలో ఉండి లబ్ధిదారులను కలవడం, కార్యకర్తలతో మమేకం కావడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఒక్కో ముఖ్యనాయకుడు వెళ్లి సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో సమావేశం కావడం గురించి జేపీ నడ్డా వివరించారు.

ముఖ్య నేతలు నియోజకవర్గాలకు వెళ్లాలి

ముఖ్య నేతలు నియోజకవర్గాలకు వెళ్లాలి

ఇలా కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడే కాకుండా ఎప్పుడూ చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం, దేశ సమగ్రత కోసం పని చేస్తుంటే విపక్షాలు విధ్వంసాన్ని కోరుకుంటున్నాయని సమావేశాల్లో నేతలు అభిప్రాయ పడ్డారు. మోదీని వ్యతిరేకించడంలో భాగంగా విపక్షాలు దేశాన్నీ వ్యతిరేకిస్తున్నాయంటూ బీజేపీ కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టాల్సిన ప్రచార వ్యూహం గురించి తొలి రోజు సమావేశాల్లో చర్చ జరిగింది. పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం..ప్రతిపక్షాల వైఖరిని తప్పు బడుతూ చర్చలు జరిగాయి. ఇక, రెండో రోజుల ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు.

English summary
PM Modi suggests party leaders to follow Gurjarath model to involve with public and winning the elections,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X