వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భుజంపై తుపాకీ.. కేసీఆర్‌కు గురిపెట్టిన మోదీ.. అసలేం జరుగుతోంది..

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అనేక రాజకీయ ఊహాగానాలకు పురుడు పోసింది. ప్రత్యేక హోదా,విభజన హామీలు,పోలవరం వంటి అంశాలపై చర్చించేందుకే జగన్ మోదీతో భేటీ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. భేటీ వెనుక మతలబు వేరే ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకే జగన్ సూచనప్రాయంగా మోదీతో భేటీ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. జగన్‌ సర్కార్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా రాజ్యసభలో తమ బలం పెరగడంతో ఎన్డీయేకు మరో ప్రయోజనం కూడా చేకూరనుంది.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు చెక్ పెట్టేందుకు..

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు చెక్ పెట్టేందుకు..

జాతీయ రాజకీయాల్లో మోదీ హవాను తట్టుకుని నిలబడగలిగే మరో నాయకుడు కనిపించడం లేదు. మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్,రాజస్తాన్‌లలో అధికారంలోకి రావడం ద్వారా కాంగ్రెస్ కాస్త పుంజుకున్నట్టు కనిపిస్తున్నా.. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తేలిపోయింది. పైగా రాహుల్ గాంధీని మోదీకి సమవుజ్జీగా చూసే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే థర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి వారు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు సాగించినప్పటికీ అది సాధ్యపడలేదు. అయితే భవిష్యత్తులో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేయాలన్న ఆలోచన మాత్రం కేసీఆర్‌లో ఉంది. కేసీఆర్ లేదా మరెవరి నాయకత్వంలో మరో ఫ్రంట్ ఏర్పడినా అది బీజేపీకి ఇబ్బందికరం కాబట్టి.. ఆ ప్రయత్నాలకు మొగ్గలోనే చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది.

మరోసారి ఫెడరల్ ఫ్రంట్ సంకేతాలిచ్చిన కేసీఆర్..

మరోసారి ఫెడరల్ ఫ్రంట్ సంకేతాలిచ్చిన కేసీఆర్..

ఇటీవల మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతేకాదు,సీఏఏకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేస్తానని,అవసరమైతే హైదరాబాద్‌లో 10లక్షల మందితో సభ నిర్వహిస్తానని చెప్పారు. ఒకరకంగా ఆయన వ్యాఖ్యల్లో.. భవిష్యత్తులో భావసారుప్యత గల పార్టీలతో కలిసి పనిచేస్తామన్న విషయం స్పష్టమైంది. తద్వారా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను తాను విరమించుకోలేదని,భవిష్యత్తులో అందుకు అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చారు.

 కేసీఆర్,కేజ్రీవాల్ కాంబోపై ఊహాగానాలు..

కేసీఆర్,కేజ్రీవాల్ కాంబోపై ఊహాగానాలు..

తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తర్వాత.. కేంద్రంలో కేసీఆర్,కేజ్రీవాల్ కలిసి పనిచేస్తే బీజేపీని ఢీకొట్టవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలంటే.. మమతా బెనర్జీ,జగన్,స్టాలిన్ లాంటి ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకుల భాగస్వామ్యం అవసరం. వారు తనతో చేరితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చునని ఆయన భావిస్తున్నారు. అయితే అందుకు ఆస్కారం ఇవ్వకుండా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు,నాయకులను తమవైపు తిప్పుకునే పనిలో పడింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే జగన్‌ను కేంద్ర కేబినెట్‌లోకి ఆహ్వానించిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్డీయేలోకి డీఎంకెను లాగే ప్రయత్నాలు..

ఎన్డీయేలోకి డీఎంకెను లాగే ప్రయత్నాలు..

అటు తమిళనాడులో డీఎంకెను కూడా ఎన్డీయేలోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో అక్కడ డీఎంకెనే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలను డీఎంకె క్లీన్ స్వీప్ చేయడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీదే అధికారం అని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనిమొళిపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని డీఎంకెను ఎన్డీయేలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా కనిమొళికి కేసుల బాధ తప్పడంతో పాటు బీజేపీకి రాజ్యసభలో సంఖ్యా బలం పెరుగుతంది. ఇటు జగన్‌ను కూడా అక్రమాస్తుల కేసులు వేధిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి కేసులు బాధ నుంచి బయటపడేందుకు వీరు ఎన్డీయేలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.

 బీజేపీ ప్లాన్..

బీజేపీ ప్లాన్..


బీజేపీని సైద్దాంతికంగా ఎదుర్కోవడంలో ఇప్పటివరకు కాంగ్రెస్ విఫలమైంది. అయితే బీజేపీ హిందుత్వ సిద్దాంతాలను పని పాలిటిక్స్ ద్వారా ఎదుర్కోవచ్చునని ఢిల్లీలో కేజ్రీవాల్ నిరూపించారు.
ఇటు కేసీఆర్ కూడా బీజేపీ హిందుత్వను హిందుత్వతోనే సవాల్ చేస్తున్నారు. ఒకరకంగా బీజేపీ మెడలు వంచగలిగే సామర్థ్యం వీరికి ఉందన్న అభిప్రాయాలు ఆ పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్,కేజ్రీవాల్ లాంటి నేతలు కేంద్రంలో కలిసి పనిచేస్తే బీజేపీని ఎదుర్కోవచ్చునని అంటున్నారు. మరోవైపు 2014తో పోలిస్తే.. ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడం బీజేపీని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఫెడరల్ ఫ్రంట్ లేదా థర్డ్ ఫ్రంట్‌కి ఆస్కారమిస్తే.. బీజేపీకి మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడుతాయి కాబట్టి.. మొగ్గలోనే ఆ ప్రయత్నాలను తుంచివేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే జగన్‌‌ను తమవైపుకు తిప్పుకోవడం ద్వారా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను నీరుగార్చవచ్చని భావిస్తోంది.

English summary
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy's meeting with Prime Minister Narendra Modi has give space to lot of political speculations. Though the YCP sources say that Jagan had met Modi only to discuss special status, partition guarantees and polavaram. It is rumored that Jagan had met Modi only to join the Union Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X