బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: 13 దేశాలు, బెంగళూరులో ల్యాండ్, అసలే అమెరికా నుంచి వస్తుంటే ? కరోనా ఉంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చేయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో బస్సులు, రవాణా, గూడ్స్ వాహనాలు, క్యాబ్ లు, కార్లు, దేశ విదేశాలకు సంచరిస్తున్న అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. లాక్ డౌన్ సందర్బంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను భారత్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. గురువారం నుంచి విదేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో భారత్ తీసుకువస్తున్నారు. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరుకు విదేశాల నుంచి కొన్ని వందల మంది వస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్ తో పాటు అనేక దేశాల నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని వందల మంది వస్తున్న సమయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలే అమెరికా నుంచి వస్తున్నారు ? జాగ్రత్త అంటున్నారు అధికారులు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

 ఎయిపోర్టులో అలర్ట్

ఎయిపోర్టులో అలర్ట్

లాక్ డౌన్ సందర్బంగా విదేశాల్లో కొన్ని వేల మంది భారతీయులు చిక్కుకున్నారు. విదేశాల్లో చిక్కుకున్న మమ్మల్ని భారత్ పిలుచుకుని వెళ్లాలని లాక్ డౌన్ విధించినప్పటి నుంచి భారతీయులు కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూనే ఉన్నారు. విదేశాల్లో కరోనా వైరస్ ఎక్కువగా ఉండటంతో వారిని భారత్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించింది.

 అయ్యో అమెరికా నుంచి వస్తున్నారు

అయ్యో అమెరికా నుంచి వస్తున్నారు

ఒకప్పుడు అమెరికాకు వెలుతున్నా, అక్కడికి వెళ్లి వస్తున్నా మేము అమెరికాకు వెళ్లి వచ్చామని గర్వంగా చెప్పుకునే ఉన్నారు. ప్రస్తుతం కరోనా దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది ఇప్పుడు ఎవరైనా అమెరికా నుంచి వస్తున్నారంటే అయ్యో, అక్కడి నుంచి వస్తున్నారా ? అంటూ హడలిపోతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా నుంచి తప్పించుకుని అమెరికా నుంచి భారత్ కు కొన్ని వందల మంది వస్తున్నారు.

 సర్వం సిద్దం చేసిన అధికారులు

సర్వం సిద్దం చేసిన అధికారులు

బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశాల నుంచి గురువారం రాత్రి నుంచి ప్రత్యేక విమానాలు ఒక్కొక్కటి చేరుకోవడానికి సిద్దం అయ్యాయి. విదేశాల నుంచి భారతీయులు వస్తున్న సమయంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 ఎయిర్ పోర్టు టూ క్వారంటైన్

ఎయిర్ పోర్టు టూ క్వారంటైన్

విదేశాల నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం చేరుకుంటున్న ప్రయాణికులకు కోనా వైద్య పరీక్షలు నిర్వహించడానికి వైద్యులు, అధికారులు సిద్దంగా ఉన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికి ఏమైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని నేరుగా బెంగళూరు నగరంలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించడానికి అధికారులు సిద్దంగా ఉన్నారు. కరోనా లక్షణాలు లేని వారిని ఎయిర్ పోర్టు నుంచి నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Recommended Video

Public Transport May Open Soon, London Model To Follow : Nitin Gadkari
అమెరికాతో పాటు 13 దేశాలు !

అమెరికాతో పాటు 13 దేశాలు !

అమెరికా, ఇంగ్లాండ్ తో పాటు 13 దేశాల నుంచి బెంగళూరుకు 700 మందికిపైగా వస్తున్నారు. విదేశాల నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానాల్లో వస్తున్న సుమారు 700 మందిని ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రభుత్వ క్వాటర్స్, గెస్ట్ హౌస్ లు, కల్యాణమండపాలు, ప్రైవేట్ హోటల్స్, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద అమెరికా నుంచి చాలా మంది బెంగళూరుకు వస్తున్నారని తెలుసుకున్న కొందరు ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Lockdown Airlift: Today 700 Passengers Arriving At Bengaluru KIAL Airport from different countries ahead of Coronavirus lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X