వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ - 19 పై లోక్ సభలో చర్చ - విజిలెన్స్ చట్టంలో సవరణలు : సభ్యుల ప్రయివేటు బిల్లులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ అయిదో రోజు సమావేశాల్లో భాగంగా ఈ రోజున లోక్ సభలో కోవిడ్ -19 పైన రూల్ 193 కింద స్వల్ప కాలిక చర్చ జరగనుంది. ఈ చర్చ సందర్బంలో భారత్ లో తాజాగా వెలుగు చూసిన ఓమిక్రాన్ కేసుల గురించి ప్రభుత్వం ప్రకటనకు ఛాన్స్ కనిపిస్తోంది. బెంగుళూరులో ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయగా.. వారిలో ఓమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. లక్షణాలు తీవ్రంగా లేకపోయినా.. ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇక, దీంతో పాటుగా ప్రతీ శుక్రవారం సాయంత్రం సెషన్ లో సభ్యుల ప్రయివేటు బిల్లులను ప్రవేశ పెట్టేందుకు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.

కోవిడ్ -19 పైన సభలో స్వల్ప చర్చ

కోవిడ్ -19 పైన సభలో స్వల్ప చర్చ

అందులో భాగంగా ఈ రోజున పెద్ద సంఖ్యలో సభ్యులు మత బిల్లులను సభ ముందు ప్రతిపాదించనున్నారు. అందులో టీడీపీ..వైసీపీ..టీఆర్ఎస్ సభ్యులు సైతం ఉన్నారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు తమ శాఖలకు చెందిన పేపర్లను సభ ముందు ఉంచనున్నారు. మహిళా సాధికారిత పైనా సభలో స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు. ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం పైన స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలు ఈ రోజు సభ ముందుకు రానున్నాయి.

కీలక చట్టాలకు సవరణలు

కీలక చట్టాలకు సవరణలు


2021-22 వార్షిక బడ్జెట్ లో సప్లిమెంటరీ డిమాండ్స్ - గ్రాంట్స్ గురించి సభలో ఆర్దిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ స్టేటమెంట్ ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర విజిలెన్స్ కమీషన్ చట్టం 2003, లో సవరణల దిశగా ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టనుంది. ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్టంలో సవరణలు కోరుతూ మరో బిల్లును ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సవరణ బిల్లును ఆరోగ్య శాఖా మంత్రి మండవీయా సభలో ప్రవేశ పెడతారు.

సభ్యుల ప్రయివేటు బిల్లుల ప్రతిపాదన

సభ్యుల ప్రయివేటు బిల్లుల ప్రతిపాదన

ఆ తరువాత రూల్ 193 కింద కోవిడ్ పైన చర్చ చేపట్టనున్నారు. ఇక, సాయంత్రం 3.30 గంటలకు సభ మరోసారి సమావేశం కానుంది. ఆ సమయంలో సభ్యులు ప్రయివేటు బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. వైసీపీ ఎంపీ లావు క్రిష్ణ దేవరాయులు ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో సవరణలో కోరుతూ ప్రయివేటు బిల్లును సభ ముందు ప్రతిపాదించనున్నారు. టీడీపీ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు మత్య్సకారులకు భరోసా..వారి సంక్షేమానికి సంబంధించి బిల్లును సభ ముందు ఉంచనున్నారు.

Recommended Video

Parliament Winter Session 2021 : No Record No Aid, Govt On Farmers Issue || Oneindia Telugu
చెన్నైలో సుప్రీం బెంచ్ ... బెంగాల్ కు ఆర్దిక సాయం

చెన్నైలో సుప్రీం బెంచ్ ... బెంగాల్ కు ఆర్దిక సాయం


ఇక, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ కు ప్రత్యేక ఆర్దిక సాయం పైన బిల్లును ప్రతిపాదించనున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని బీసీ..ఎస్సీ..ఎస్టీల సంక్షేమం కోసం నిధులను సక్రమంగా వినియోగించేలా బిల్లను సభ ముందుకు తీసుకురానున్నారు. చెన్నైలె సుప్రీం శాశ్వత బెంచ్ ఏర్పాటు కోరుతూ డాక్టర్ ఎం కే క్రిష్ణ ప్రసాద్ ప్రయివేటు బిల్లును ప్రతిపాదించనున్నారు. ఇక, రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ పైన రగడ కొనసాగుతోంది. 12 మంది సభ్యులు క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేత అంశాన్ని పరిశీలిస్తామని ఛైర్మన్ చెబుతున్నారు. అయితే, విపక్షాల సభ్యులు మాత్రం సస్పెన్షన్ ఎత్తివేయాంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.

English summary
Discussion on Covid -19 under rule 193 in loksabha to day, also introduce ammendements for various bill in the house. Member also introduce thier private bill in the Loksabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X