వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7రాష్ట్రాల్లో ముగిసిన రాజ్యసభ ఎన్నికలు: టీలో బీజేపీ దూరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 25 సీట్లకోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు పూర్తయిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. ఇందులో పదిసీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్‌ నుంచే ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాగింది. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

 Today polls for 25 Rajya Sabha seats: all eyes on Uttar Pradesh

ఎస్పీ వద్ద అదనంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో బీఎస్పీ గెలుస్తుందని భావించినా.. ఇండిపెండెంట్లతోపాటు ఎస్పీలోని శివ్‌పాల్‌ వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకే శుక్రవారం ఎన్నికలు జరిగాయి.

Newest First Oldest First
4:17 PM, 23 Mar

శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. మరో గంటలో ఫలితాలు వెలువడనున్నాయి.
3:10 PM, 23 Mar

బీజేపీ 16, కాంగ్రెస్ 5, టీడీపీ 2, వైయస్సార్ కాంగ్రెస్ 1, జేడీయూ 2, ఆర్జేడీ 2, శివసేన 1, ఎన్సీపీ 1, బీజేడీ 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
2:18 PM, 23 Mar

క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు కొద్ది నిమిషాలపాటు నిలిచిపోయాయి.
2:17 PM, 23 Mar

కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
1:10 PM, 23 Mar

ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓటు హక్కును పరిగణలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
1:10 PM, 23 Mar

ఇప్పటి వరకు 101మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
11:40 AM, 23 Mar

టీఆర్ఎస్ ఎలక్షన్ ఏజెంట్లుగా రమేష్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, రాజేష్, గట్టు రామచంద్రరావు ఉండగా, కాంగ్రెస్ ఎలక్షన్ ఏజెంట్లుగా మల్లు రవి, సీతక్క, రేగా కాంతారావు, కోదండరెడ్డి ఉన్నారు.
11:39 AM, 23 Mar

మొదట హరీష్‌రావు ఓటు హక్కు వినియోగించుకోగా రెండో ఓటు హక్కును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వినియోగించుకున్నారు.
11:39 AM, 23 Mar

ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకుగానూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.
11:39 AM, 23 Mar

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మొదట ఓటు హక్కు వినియోగించుకున్నారు.
10:56 AM, 23 Mar

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 58 మంది ఎంపీలు ఉన్నారు.
10:56 AM, 23 Mar

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఎక్కువ రాజ్యసభ స్థానాలు వచ్చాయి.
10:56 AM, 23 Mar

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఎక్కువ రాజ్యసభ స్థానాలు వచ్చాయి.
10:56 AM, 23 Mar

45 మంది రాజ్యసభ సభ్యుల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచే 31 మంది ఎంపీలు ఉంటారు.
10:56 AM, 23 Mar

కాగా, సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పొత్తు కారణంగా మరో సీటు గెలవడంపై అనుమానాలు నెలకొన్నాయి.
10:55 AM, 23 Mar

యూపీలోని 10 స్థానాల్లో 8 చోట్ల బీజేపీ సులువుగా గెలిచే అవకాశాలున్నాయి.
10:55 AM, 23 Mar

ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా బరిలో ఉన్నారు.
10:27 AM, 23 Mar

ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, చత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
10:24 AM, 23 Mar

తెలంగాణతోపాటు 25 సీట్ల కోసం ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
10:23 AM, 23 Mar

కాగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు తెలిపింది.
9:10 AM, 23 Mar

టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు (బలరాం నాయక్) బరిలో ఉన్నారు.
9:08 AM, 23 Mar

తెలంగాణలో మూడు సీట్లకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
9:06 AM, 23 Mar

తెలంగాణలో పోలింగ్ కోసం అసెంబ్లీ కమిటీ హాల్‌లో 7కౌంటర్లు ఏర్పాటు చేశారు.
9:04 AM, 23 Mar

శుక్రవారం ఉదయం 9గంటలకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
8:30 AM, 23 Mar

ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్‌ను తీసుకుంటే, ఆ రాష్ట్రంలో 403 మంది ఎమ్మెల్యేలున్నారు. అక్కడ 10 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి [(403x100) / (10+1) ] + 1 = 3,664 ఓట్లు కావాలి. కనీసం 37 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వాలి.
8:30 AM, 23 Mar

[(ఎమ్మెల్యేల సంఖ్య x 100) / (ఖాళీలు + 1)] +1
8:29 AM, 23 Mar

ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 100. రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అభ్యర్థికి అవసరమైన మొత్తం ఓట్లు ఇలా ఉంటాయి.
7:38 AM, 23 Mar

కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం సభ్యులు ఎవరికి ఓటు వేస్తున్నారో పార్టీ పోలింగు ఏజెంటుకు చూపించాలి.
7:37 AM, 23 Mar

ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థి బలరామ్‌నాయక్‌కు ఓటు వేయాలని కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది.
7:37 AM, 23 Mar

కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ బలం 17కాగా ఇందులో ఏడుగురు టీఆర్ఎస్‌లో చేరారు.
READ MORE

English summary
The stage is set for Rajya Sabha polls on Friday for the remaining 25 seats in six states including Uttar Pradesh. The Narendra Modi-led BJP government at the Centre, currently has 58 members, four more than the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X