వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపూర్ణ సూర్యగ్రహణం .. చాలా పవర్ఫుల్ .. ఎలా పడితే అలా చూస్తే యమా డేంజర్ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభం అయ్యింది .. నేడు ఏర్పడిన అలాంటి ఇలాంటి సూర్యగ్రహణం కాదు చాలా పవర్ఫుల్ అయిన కేహుగ్రస్థ సూర్యగ్రహణం . భారత కాలమానం ప్రకారం ఉదయం గం.8.09ని.లకు గ్రహణం ప్రారంభం అయ్యి ఉదయం గం.11.11ని.లకు నేటి సూర్యగ్రహణం ముగుస్తుంది. మొత్తం మూడు గంటల రెండు నిమిషాల పాటు భారతదేశం అంతటా ఈ గ్రహణం కనిపించనుంది.

సంపూర్ణ సూర్యగ్రహణం, ఎప్పటినుంచో తెలుసా, గ్రహణం రోజు ఏం చేయొద్దు, ఏం చేయాలి..సంపూర్ణ సూర్యగ్రహణం, ఎప్పటినుంచో తెలుసా, గ్రహణం రోజు ఏం చేయొద్దు, ఏం చేయాలి..

 కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణ ఆకారంలో కనిపించనున్న సూర్యగ్రహణం

కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణ ఆకారంలో కనిపించనున్న సూర్యగ్రహణం

డిసెంబర్ 26 సూర్యగ్రహణం దక్షిణ భారతదేశంలో చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. భారతదేశం కాకుండా, మధ్యప్రాచ్యం, ఈశాన్య ఆఫ్రికా, ఆసియా (ఉత్తరం తప్ప), తూర్పు రష్యా, ఉత్తర మరియు పశ్చిమ ఆస్ట్రేలియా మరియు సోలమన్ ద్వీపాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే మన దేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణ ఆకారంలో సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాల్లో కన్పించనుంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.

ప్రత్యక్షంగా చూడటం డేంజర్ .. అత్యంత శక్తివంతమైన యూవీ కిరణాలతో ఆరోగ్యానికి హాని

ప్రత్యక్షంగా చూడటం డేంజర్ .. అత్యంత శక్తివంతమైన యూవీ కిరణాలతో ఆరోగ్యానికి హాని


సాధారణంగా గ్రహణాలను చూసే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడటం వలన చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . ముఖ్యంగా నేటి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో యూవీ కిరణాలు అత్యనత శక్తివంతంగా ఉంటాయి. డైరెక్ట్ గా చూస్తే దాని ప్రభావం మానవ శరీరాలపై పడుతుంది అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.

 సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్‌ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని శాస్త్రవేత్తల సూచన

సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్‌ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని శాస్త్రవేత్తల సూచన

అందుకే ముఖ్యంగా సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్‌ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని వారు చెబుతున్నారు . అలాగే రెగ్యులర్ సన్ గ్లాసెస్‌ను ఉపయోగించకూడదని కూడా వారు సూచిస్తున్నారు . నేడు డిసెంబర్ 26 న సూర్యగ్రహణం 2019 లో జరిగే మూడవ సూర్యగ్రహణం . భారత కాలమాన లెక్కల ప్రకారం, 2028 వరకు ప్రతి సంవత్సరం రెండు సూర్యగ్రహణాలను చూస్తాము.

రాశుల మీద సూర్యగ్రహణం ప్రభావం

రాశుల మీద సూర్యగ్రహణం ప్రభావం

ఇక నేడు ఏర్పడిన సూర్యగ్రహణం 16ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ఈ గ్రహణం కొన్ని రాశుల వారిపై చాలా ఎఫెక్ట్ చూపనుంది. ధనస్సు రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది. అలాగే అష్టమ స్థానంలోనూ, అర్ధాష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి.. వృషభ రాశి, కన్యా రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మిగిలిన రాశుల వారిని ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని కూడా జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.

English summary
the December 26 solar eclipse will be visible most prominently in South India. Apart from India, the solar eclipse will be visible in the Middle East, North Eastern Africa, Asia (except north), Eastern Russia, North and Western Australia and Solomon Island.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X