వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి డెత్ మిస్టరీ, ఊహించని ట్విస్ట్‌లు: 'పని చేసుకోనివ్వండి', అసలేం జరిగింది.. బోనీ చుట్టూ ఉచ్చు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi : Cops Question Boney Kapoor, Statement Recorded

దుబాయ్: నటి శ్రీదేవి మృతిపై మీడియాలో పెద్ద ఎత్తున అనుమానాలు వస్తుండటంతో యూఏఈ భారత్ ఎన్వాయ్ స్పందించింది. ఈ మేరకు యూఏఈ ఎన్వాయ్ నవదీప్ సూరీ స్పందిస్తూ.. దుబాయి అధికారులు అన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారని, వాటి కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.

గత అనుభవాలను బట్టి ఇలాంటి కేసులకు రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుందని చెప్పారు. శ్రీదేవి మృతిపై మీడియా అవాస్తవ కథనాలు చెప్పవద్దని, నిపుణులను వారి పని వారిని చేయనివ్వాలని నవదీప్ సూరి హితవు పలికారు. ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు.

వారి పని వారు చేసుకోనివ్వండి

వారి పని వారు చేసుకోనివ్వండి

శ్రీదేవి మృతికి కారణాలను వైద్య నిపుణులు, పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారని నవదీప్ సూరి అన్నారు. ఏం జరిగిందనేది వారికి వదిలేశామని, వారి పనిని వారిని చేసుకోనివ్వాలని మీడియాకు ఒకింత ఘాటుగానే సూచించారు. దుబాయ్ అధికారులతో మనవాళ్లు టచ్‌లో ఉన్నారని చెప్పారు.

శ్రీదేవి రిపోర్టులో సంచలన విషయాలు: బాడీలో అల్కాహాల్, ఎలా మృతి చెందిందంటే?శ్రీదేవి రిపోర్టులో సంచలన విషయాలు: బాడీలో అల్కాహాల్, ఎలా మృతి చెందిందంటే?

ఆ గంటపై ఆరా తీస్తున్న పోలీసులు

ఆ గంటపై ఆరా తీస్తున్న పోలీసులు

ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీన రాత్రి గం.10.01 నిమిషాలకు చనిపోయారు. కానీ అంతకు గంట ముందే, అంటే తొమ్మిది గంటలకు పోలీసులకు ఫోన్ వెళ్లింది. దీంతో ఆ గంటసేపు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

శ్రీదేవి మృతిలో కుట్ర!: దుబాయ్ పోలీసులు ఏం చెప్పారంటే, రేపు అంత్యక్రియలుశ్రీదేవి మృతిలో కుట్ర!: దుబాయ్ పోలీసులు ఏం చెప్పారంటే, రేపు అంత్యక్రియలు

పాస్‌పోర్ట్ సీజ్, బోనీ చుట్టు ఉచ్చు

పాస్‌పోర్ట్ సీజ్, బోనీ చుట్టు ఉచ్చు

మరోవైపు, బోనీ కపూర్‌ను పోలీసులు మంగళవారం విచారించినట్లుగా మరోసారి వార్తలు వస్తున్నాయి. సోమవారం ఆయనను మూడున్నర గంటల పాటు విచారించారన్న వార్తలను దుబాయ్ పోలీసులు కొట్టిపారేశారు. అయితే ఆదివారం వాంగ్మూలం తీసుకున్నామని చెప్పారు. తాజాగా మరోసారి విచారించారని తెలుస్తోంది. ఆయన పాస్‌పోర్టును సీజ్ చేశారు. బోనీ చుట్టు ఉచ్చు బిగుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీదేవి-బోనీకపూర్‌ల మధ్య ఏం జరిగింది

శ్రీదేవి-బోనీకపూర్‌ల మధ్య ఏం జరిగింది

పోలీసులు శ్రీదేవి, బోనీ కపూర్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. హోటల్ రూంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారని తెలుస్తోంది. శ్రీదేవి, బోనీ కపూర్‌ల మధ్య ఏం జరిగిందనే విషయం తెలుసుకోనున్నారు. పోలీసులు హోటల్ సిబ్బందిని కూడా విచారించారు. ప్రధానంగా శ్రీదేవి కాల్ డేటాపై దృష్టి సారించారు. లోతుగా విచారణ జరుపుతున్నారు.

హైప్రొఫైల్ అయినా ఇదే పద్ధతి

హైప్రొఫైల్ అయినా ఇదే పద్ధతి

ఇదిలా ఉండగా, మీడియాలో శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వస్తున్నాయి. దీనిపై సమాధానాలు ఇలా వినిపిస్తున్నాయి. 'కేసు ప్రస్తుతం ప్రాసిక్యూషన్ పరిధిలో ఉంది. భారతీయ మీడియా చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. శ్రీదేవి మృతి విషయంలో చాలా కోణాలు, అనుమానాలు వినిపిస్తున్నాయి. ఏ కేసు అయినా ఇక్కడ ఇలాగే విచారణ జరుగుతుంది. హైప్రొఫైల్ కేసు అయినా ఇదే పద్ధతి. యూఏఈ ప్రొసీజర్‌లో భాగంగానే అంతా జరుగుతోంది.

అనుమానాలుంటే రీపోస్టుమార్టం

అనుమానాలుంటే రీపోస్టుమార్టం

విచారణపై ప్రాసిక్యూషన్‌కు అసంతృప్తి ఉంటే మళ్లీ దర్యాఫ్తుకు ఆదేశిస్తారు. దీనిని బట్టి చూస్తే రీపోస్టుమార్టం జరిగే అవకాశముంది. ఇప్పటికే దర్యాఫ్తు అధికారులు కేసును తిరిగి విచారిస్తున్నారని తెలుస్తోంది. శ్రీదేవి కుటుంబం మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా అనే కోణంలోను విచారణ సాగుతోంది. అన్ని సందేహాలు తీరాకే మృతదేహాన్ని అప్పగిస్తారు.

మూడు రోజులు గడిచినా

మూడు రోజులు గడిచినా

హోటల్ రూంలో పోలీసులను, డాక్టర్లను పిలిచే ముందు మూడు గంటల వ్యవధిలో ఏం జరిగింది? ఈ విషయం ఇప్పటికీ తెలియరాలేదు. భౌతికకాయాన్ని ఈ రోజు ముంబై పంపే అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు శ్రీదేవి మృతి చెంది మూడు రోజులు గడిచింది. ఈ రోజు కూడా భారత్ పంపే అవకాశం లేదు.

English summary
Indian envoy to UAE Navdeep Suri said they were waiting for the "clearance" from Dubai authorities for the body to be flown back to Mumbai. "Our experience in similar cases tells us that it does take 2-3 days to complete processes," Mr Suri said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X