వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కిలో టమాట రూ.100, కారణమిదే

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. మిజోరాం రాష్ట్రంలో ఏకంగా కిలో టమాట ధర రూ.100లకు చేరుకొంది. ఢిల్లీలో కిలో టమాట రూ.80లకు విక్రయించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. మిజోరాం రాష్ట్రంలో ఏకంగా కిలో టమాట ధర రూ.100లకు చేరుకొంది. ఢిల్లీలో కిలో టమాట రూ.80లకు విక్రయించారు.

టమాట ఎక్కువగా పండించే కర్ణాటక రాష్ట్రంలో కూడ టమాట ధర పెరిగింది. కిలో రూ.జ45 నుండి 50 రూపాయాలకు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లోని టొమాటో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి తగ్గిపోయిందని అజాద్‌పూర్‌ మండి టొమాటో మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ కౌశిక్‌ తెలిపారు.

Tomato prices harden, hit Rs 80 per kg in Delhi

మధ్యప్రదేశ్‌లో 90శాతం మేర పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ కారణంగానే ధరలు పెరిగాయని ఆయన చెబుతున్నారు.ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన అజాద్‌పూర్‌ మండిలో కిలో టొమాటో రూ.40-50 పలుకుతోంది. ఇక రిటైల్‌గా నాణ్యతను బట్టి రూ.70-80కు విక్రయిస్తున్నారు.

ఇక టమాట ఎక్కువగా పండే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇటీవలి వర్షాలతో పంట దెబ్బతినడంతో సరఫరాలు తగ్గి ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమాట మరో 20 రోజుల్లో మార్కెట్‌కు వస్తే పరిస్థితిలో కొంత మార్పు ఉంటుందని అజాద్‌పూర్‌ మండీలో టమాట మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ కౌశిక్‌ చెప్పారు.

English summary
Tomato prices in retail markets of the national capital soared to Rs 80 per kg today in view of tight supplies, trade data showed. The key kitchen staple has become equally dearer in other parts of the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X