• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టమాట మాటంటే బెదిరిపోతున్న సామాన్యులు...ధరలు మళ్లీ పెరిగే అవకాశం?

|

కూరల్లో టమాటా లేకుంటే రుచే ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే కూరల్లో కింగ్ లాంటిది టమాటా. ఎర్రగా నిగనిగ లాడే ఈ టమాటా సామాన్యుడకి అందుబాటులో లేకుండా పోతోంది. అంటే దీని ధర ఇంకా ఎర్రగా మండుతోంది. దీంతో సామాన్యుడు టమాటా మాట మాట్లాడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు కిలో రూపాయి పలికిన ఈ కూరగాయ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రూ. 80 వరకు పలుకుతోంది. టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణమేంటి..?

పెరుగుతున్న టమాటా ధరలు

పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా ధర దగ్గరదగ్గరగా రూ. 80 వరకు పలుకుతోంది. ఒకప్పుడు టమాటాకు గిట్టుబాటు ధర లభించక రైతన్న కిలోను ఒక్క రూపాయికే అమ్ముకోవాల్సిన దుస్థితి రావడంతో పండించిన పంటను అలానే ఆగ్రహంతో రోడ్డుపైనే పడేసేవాడు. ఇప్పుడు అదే టమాటా సామాన్యుడి ఇంట్లో కనిపించడం లేదు. దీనికి కారణం ధరల పెరుగుదలనే.

 కిలో టమాటా కొనేందుకు భయపడుతున్న సామాన్యుడు

కిలో టమాటా కొనేందుకు భయపడుతున్న సామాన్యుడు

టమాటా మాట మాట్లాడాలంటేనే భయపడుతున్నారు సామాన్యులు. వర్షాలు సరిగ్గా పడకపోవడం సమయానికి పంట చేతికి రాకపోవడంతో టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉత్తర భారతంలో కిలో టమాటా ధర ఏకంగా రూ.80 పలుకుతోంది. దీంతో వెండార్లు టమాటాలను రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసినప్పటికీ సామాన్యుడు వీరి దగ్గర నుంచి కొనుగోలు చేయడం లేదు. భారతదేశంలో టమాటా పంట రాబడి వాతావరణం కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట మొత్తం ధ్వంసం అయ్యింది. దీంతో చేతికందివచ్చిన పంటనే బంగారంలా అమ్ముకుంటున్నారు.

పెరిగిన రవాణా ఛార్జీలు

పెరిగిన రవాణా ఛార్జీలు

భారీ వర్షాలు కురువడంతో పలు రాష్ట్రాల్లో వరదలు కూడా వస్తున్నాయి. దీంతో టమాటాలను ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడం కష్టమైపోయింది. ఒక వేళ రవాణా చేద్దామనుకున్నా.. వరదలు ఉన్నందున రవాణా ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు ఉన్నందున గోడౌన్లలో ఉన్న టమాటా సరుకంతా కుల్లిపోతోందని వెండార్లు చెబుతున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాల ధాటికి టమాటా పంట నాశనమైపోతోందని వాపోతున్నారు.వాతావరణం కారణాలు, రవాణా ఛార్జీలు పెరగడంతో టమాటా ధరలు రెట్టింపు అయ్యాయని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు టామాటా పంటపై తీవ్ర ప్రభావం చూపుతుండగా.... పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో ఎండదెబ్బకు టమాటా పంట దెబ్బతింటోందని వెండార్లు చెప్పారు.

ఇతర కూరగాయలపై ప్రభావం చూపుతోన్న టమాటా ధరలు

ఇతర కూరగాయలపై ప్రభావం చూపుతోన్న టమాటా ధరలు

ఇక టమాటా ధరలు పెరగడంతో సామాన్యుడి జేబుకు ఖచ్చితంగా చిల్లుపడుతోంది. టమాటా ధరల పెంపు ఇతర కూరగాయలపై కూడా పడుతోంది. ఇందులో కొత్తిమీర, ఓక్రా, సొరకాయ, ఉల్లిపాయలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉంటే కూరగాయలు పండించడంలో ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ , మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ముందువరసలో ఉంటాయి. కానీ ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక వాతావరణ పరిస్థితులు ఇలానే కొనసాగితే టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సరఫరాదారులు చెబుతున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో టమాటా పంట దెబ్బతినడంతో బెంగళూరు నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటున్నారు.

English summary
With the onset of monsoon in the country, tomato prices are soaring in Delhi and neighbouring areas. Earlier this week, the retail price of tomatoes rose to as high as ₹60-80 in vegetable markets across the national capital region. The hike is affecting vendors and customers who must now bear the brunt of poor weather conditions which are driving the price upwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more