వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే మేనిఫెస్టో విడుద‌ల‌..!? ఢిల్లీలో క‌స‌రత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌లు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైద‌రాబాద్ : భైఆద‌దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి రాజుకొంది. అదికార బీజేపి పార్టీని గ‌ద్దె దించాల‌ని కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీని ఓడించి మ‌ళ్లీ అదికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని క‌మ‌లం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. రెండు పార్టీల మ‌ద్య తీవ్ర‌పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారుఇరు పార్టీల ముఖ్య నేత‌లు. అంతే కాకుండా జ‌న‌రంజ‌క మానిఫెస్తోను విడుద‌ల చేసేందుకు రెండు ప్ర‌ధాన పార్టీలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు స‌న్నాహాలు చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపి పార్ట‌లు. ఇక ఎన్నిక‌ల ముందు అత్యంత ముఖ్య‌మైన మేనిఫెస్టో ను ప్ర‌జ‌ల‌ముందుంచేందుకు కాంగ్రెస్ పార్టీ స‌న్నాహాలు చేస్తోంది.

సామాన్యుల సంక్షేంమ‌మే లక్ష్యం..! మేనిఫెస్టోను రూపొందింస్తోన్న కాంగ్రెస్..!!

సామాన్యుల సంక్షేంమ‌మే లక్ష్యం..! మేనిఫెస్టోను రూపొందింస్తోన్న కాంగ్రెస్..!!

బీజేపీని స‌మ‌ర్థంగా ఎదుర్కొని ఈ సారి గెలిచి అధికారంలోకి రావాల‌ని పోరాడుతున్న కాంగ్రెస్‌.. ఎన్నిక‌ల మ్యానిఫెస్టో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఏప్రిల్ 2వ తేదీన మేనిఫెస్టోను విడుద‌ల చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో పేద‌లు, రైతులు ల‌క్ష్యంగా భారీ వ‌రాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధానంగా రైతు రుణ‌మాఫీని ప్ర‌స్తావించ‌నున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ప్రక‌టిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా రైతు రుణ మాఫీ..! పేద‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు వేస్తామంటున్న రాహుల్..!!

దేశ వ్యాప్తంగా రైతు రుణ మాఫీ..! పేద‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు వేస్తామంటున్న రాహుల్..!!

ఇదే హామీ ఇచ్చి గ‌తేడాది డిసెంబ‌రులో జ‌రిగిన అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో మూడు కీల‌క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం ద‌క్కించుకుంది. అనంత‌రం ఆయా రాష్ట్రాల‌లో రైతుల‌కు రుణ మాఫీ చేసింది. తాజాగా దేశ‌వ్యాప్తంగా రుణ‌మాఫీ హామీని ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో కాంగ్రెస్ ప్ర‌క‌టించనుంది. అయితే.. ఇది ల‌క్ష రూపాయ‌ల‌కే ప‌రిమితం చేస్తారా..? లేదా 2ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పెంచుతారా అన్న‌ది తేలాల్సి ఉంది.

న్యాయ్ పేరిట ఆర్థిక సాయం..! ఫ‌లితం ఇవ్వ‌నున్న ప‌థ‌కం..!!

న్యాయ్ పేరిట ఆర్థిక సాయం..! ఫ‌లితం ఇవ్వ‌నున్న ప‌థ‌కం..!!

ఇక పేద‌ల‌కు మ‌రో బారీ ప‌థ‌కాన్ని రాహుల్‌గాంధీ ప్ర‌క‌టించారు. క‌నీస ఆదాయ ప‌థ‌కం కింద ఏటా పేద కుటుంబాల‌కు 72వేల రూపాయ‌లు సాయం అందించే ప‌థ‌క‌మిది. నెల‌కు 6వేల రూపాయ‌ల కంటే త‌క్కువ ఆదాయం ఉన్న పేద‌ల ఖాతాల్లో లోటు ఆదాయాన్ని జ‌మ‌చేయ‌నున్నారు. న్యాయ్ పేరిట ఈ ప‌థ‌కాన్ని కాంగ్రెస్ అమ‌లు చేయ‌నుంది.

ప్ర‌భావం చూపించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో..! మ‌రి కారికాసేప‌ట్లో విడుదల‌..!!

ప్ర‌భావం చూపించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో..! మ‌రి కారికాసేప‌ట్లో విడుదల‌..!!

దాదాపు 20కోట్ల మంది పేద‌ల‌కు ఇది ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని అంచ‌నా. రైతుల‌కు రుణ‌మాఫీ, క‌నీస ఆదాయ ప‌థ‌కంపై కాంగ్రెస్ భారీ ఆశ‌లు పెట్టుకుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు 20శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీ వంటి కీల‌క హామీలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. పేద‌ల‌కు సబ్సిడీపై ఇస్తున్న సిలిండ‌ర్ల‌ను పెంచే వ‌రాన్ని కాంగ్రెస్ ప్ర‌కటించ‌నుంది.

English summary
The Congress is struggling to win the BJP and come to power this time. The election manifesto is ready for release. It is reported that the manifesto is ready to release on April 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X