వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్ .. పైలట్ అభినందన్ విడుదలకు పాక్ ఓకే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిడికి పాకిస్థాన్ ఎట్టకేలకు తగ్గింది. భారత వాయుసేన ఫైలట్ అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేసేందుకు అంగీకరించింది. శుక్రవారం ఆయనను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా మీడియాకు తెలిపారు.

tommorrow pakistan release abhinandan

పాక్ పై ఒత్తిడి ..
పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ ను అన్నివిధాలుగా భారత్ ఏకాకి చేసింది. అంతర్జాతీయ సమాజంలో దౌత్యపరంగా .. ఉగ్రవాదంపై పోరాడుతూ ఐక్యరాజ్యసమితిలో మద్దతు సాధించింది. అమెరికా, రష్యా, కెనడా సహా చైనా కూడా భారత చర్యను సమర్థించడంతో .. ఒంటరైన పాకిస్థాన్ .. అభినందన్ ను తప్పక విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విడుదల తర్వాతే చర్చలు ..
బుధవారం ఉదయం అభినందన్ ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించాక ... వెంటనే విడుదల చేయాలని భారత్ స్పష్టంచేసింది. శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచించిన .. ప్రధాని మోదీ తిరస్కరించారు. ముందు అభినందన్ విడుదల తర్వాతే చర్చల గురించి ఆలోచిస్తామని స్పష్టంచేశారు. దీంతో వెనక్కితగ్గిన పాకిస్థాన్ .. అభినందన్ ను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది.

English summary
good news to india. pakistan to release iaf fighter abhinandan. tommrrow we will send to india abhinandan.. says pakistan prime minister imran khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X