వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని మెచ్చుకుంటావా, జాగ్రత్త: నితీష్‌కు వారి అల్టిమేటం

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ ముఖ్య నేత నితీష్ కుమార్‌కు మిత్ర పక్షాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకోవద్దని ఆయనకు మిత్ర పక్షాలు సూచించాయి.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ ముఖ్య నేత నితీష్ కుమార్‌కు మిత్ర పక్షాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకోవద్దని ఆయనకు మిత్ర పక్షాలు సూచించాయి. నోట్ల రద్దును నితీష్ కుమార్ ప్రశంసించిన విషయం తెలిసిందే.

బీహార్‌ కాంగ్రెస్‌ నేత, మంత్రి అశోక్‌ చౌదరి దీనిపై స్పందించారు. నితీశ్ కుమార్‌ జాగ్రత్తగా వ్యవహరించాలని, తాము ఈ చర్యను వ్యతిరేకిస్తున్నామని, అధిష్ఠానం నిర్ణయం మేరకు నితీశ్‌తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. అదే అదిష్ఠానం వద్దని చెప్తే కూటమి నుంచి బయటకి వెళ్లేందుకు సిద్ధమన్నారు.

మోడీ ధైర్యంగా పులి మీద స్వారీ చేస్తున్నారు: నితీష్ ఆసక్తికర వ్యాఖ్యమోడీ ధైర్యంగా పులి మీద స్వారీ చేస్తున్నారు: నితీష్ ఆసక్తికర వ్యాఖ్య

కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా విమర్శలు గుప్పించారు.

Tone Down Praise Of Notes Ban, Allies Warn Nitish Kumar

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం నల్లధనాన్ని వెలికి తీయటంలో విఫలమైందని, దానిని నితీశ్ కుమార్‌ సమర్థించటం తనను నిరాశకు గురి చేసిందని లాలూ ప్రసాద్ అన్నారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ కూడా ఈ విషయమై నితీశ్ కుమార్‌కి వ్యతిరేకంగానే మాట్లాడారు.

మరోవైపు, నితీశ్‌ కుమార్.. మోడీని ప్రశంసించినా జేడీయూ అగ్ర నేతలు, ఎంపీలు ఢిల్లీలో ప్రతిపక్షాలతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రధాని నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందని నితీశ్‌ భావిస్తున్నారని, అందుకే ఆయన దానిని వ్యతిరేకించడం లేదని, అదే సమయంలో ప్రజల అవస్థలు గమనించిన ఆయన పేదలు, రైతులు ఇబ్బంది పడుతున్నట్లు అంగీకరించారని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారని నితీష్ వర్గీయులు చెబుతున్నారు.

కాగా, నల్ల ధనాన్ని నిర్మూలించేందుకు రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేయడాన్ని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ సమర్థించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ప్రధానమంత్రి ఇప్పుడు ధైర్యంగా పులి పైన స్వారీ చేస్తున్నారని కితాబిచ్చారు.

English summary
Nitish Kumar's fast and frequent praise for Prime Minister Narendra Modi's ban on 500 and 1,000-rupee notes has upset both his allies, the Congress and Lalu Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X