వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ, ముంబైలో థర్డ్ వేవ్ పీక్: సైంటిస్ట్

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు చోట్ల ధర్డ్ వేవ్ పీక్‌కి చేరిందని డాక్టర్ సమీరన్ పాండా అభిప్రాయపడ్డారు. ఆయన ఐసీఎంఆర్ వ్యాధుల విభాగం హెడ్‌గా ఉన్నారు. ఢిల్లీ, ముంబై సిచుయేషన్ చెప్పేందుకు మరో రెండు వారాలు ఆగాల్సి ఉంటుందని చెప్పారు. పీక్‌కి చేరిందా.. పరిస్థితి చేయి దాటిందా అనే అంశాలను ఇప్పుడే చెప్పలేమన తెలిపారు. మరికొద్దీ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత లేదని చెప్పారు. కానీ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పారు.

కేసుల గురించి కానీ.. పాజిటివీ రేటు గురించి లెక్కగట్టలేమని చెప్పారు. ఆ రెండు చోట్లు ఒమిక్రాన్ 80 శాతం, డెల్టా 20 శాతం కేసులు ఉండొచ్చని చెప్పారు. అంతేకాదు దేశంలో వివిధ ప్రదేశాల్లో కరోనా వైరస్ పలు స్టేజీలలో ఉంటుందని తెలిపారు. కరోనా కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే మార్చి 11 తర్వాత సముహ వ్యాప్తి తప్పదని హెచ్చరించారు.

 Too early to say Delhi, Mumbai have hit their Covid-19 third wave peak

ఇటు కరోనా కేసులు పెరుగుతున్న.. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని ప్రభుత్వాలు భావిస్తోన్నాయి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. కరోనా కేసుల నేపథ్యంలో కర్ఫ్యూ, స్కూళ్ల సెలవుల పొడగింపు.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభం.. కర్ఫ్యూ విధిస్తే మార్కెట్‌పై ప్రభావం తదితర అంశాల గురించి డిస్కష్ చేస్తోన్నాయి.

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

English summary
Dr Samiran Panda said that it is too early to confirm whether Delhi and Mumbai have hit their peak in the country’s third wave of the Covid-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X