• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Toolkit case:ఫేస్‌టైమ్‌లో దిశ, నికితతో ఉన్నదెవరు? -జూమ్ సంస్థను వివరాలు కోరిన ఢిల్లీ పోలీసులు

|

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారం నాటికి 83వ రోజుకు చేరాయి. ఈ ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్ర ఉందంటోన్న కేంద్రం.. రిపబ్లిక్ డే నాటి హింసకు ఆ శక్తులే ప్రేరేపించాయని అనుమానిస్తోంది. అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన 'టూల్ కిట్' ద్వారా హింస ప్రజ్వరిల్లినట్లు కేంద్ర సర్కారు ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ప్రఖ్యాత వీడియో కాలింగ్ యాప్ 'జూమ్' సంస్థను వివరాలు కోరారు..

రైతుల నిరసనల్లో చోటుచేసుకున్న హింసకు సంబంధించి 'టూల్ కిట్' వివాదంపై విచారణను ఢిల్లీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ జూమ్‌కు మంగళవారంనాడు లేఖ రాశారు. రిపబ్లిక్ డే (జనవరి 26) ముందు పొయిటిక్ జస్టిస్ ఫౌండర్ ఎంఓ ధలివాల్, యాక్టివిస్ట్‌ దిశారవి, నికితా జాకోబ్, తదితరులు నిర్వహించిన జూమ్ మీటింగ్ వివరాలు తెలియజేయాలని ఆ లేఖలో కోరారు. నిజానికి..

నిమ్మగడ్డ మరో సంచలనం -జగన్ సమ్మతితో ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్? -అత్యంత సంక్లిష్టం

Toolkit case: Delhi Police writes to Zoom, seeks details of meeting ahead of R-Day violence

ఢిల్లీలో రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమంలో హింసకు రూపకల్పన చేసే లక్ష్యంతోనే జనవరి 11న.. అంటే రిపబ్లిక్ డేకి 15 రోజులకు ముందే జూమ్ మీటింగ్ జరిపారని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. 'టూల్‌కిట్' విధివిధానాలను నిర్ణయించేందుకే మీటింగ్ ఉద్దేశించినట్టు సైబర్ సెల్ అధికారులు చెబుతున్నారు. టూల్‌కిట్‌ను రవి, జాకోబ్, శంతను రూపొందించి ఇతరులకు షేర్ చేశారని వారంటున్నారు. దిశ రవిని బెంగళూరులో శనివారంనాడు అరెస్టు చేసి ఐదురోజుల పోలీస్ రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న లాయర్ జాకోబ్, ఇంజనీర్ శంతను ములుక్‌‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. కాగా,

వైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్‌పాండ్ నుంచి ఫోన్లు

రిపబ్లిక్ డే ముందు రోజున.. ముగ్గురు ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థకు చెందిన పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్) నిర్వహించిన జూమ్ మీటింగ్‌కు హాజరైనట్టు నికితా జాకబ్ అంగీకరించారు. ఈ మేరకు నికితా తరఫున లాయర్ ముంబయి పోలీసులకు డాక్యుమెంట్లు సమర్పించారు. అయితే, ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నట్టు ఈ టూల్‌కిట్‌ను తాము రూపొందించలేదని, ఎక్సిటిక్షన్ రెబెలియన్ వాలంటీర్లు తయారుచేశారని తెలిపారు. అంతేకాదు, గ్రెటా థన్‌బర్గ్‌కు తాను ఎటువంటి సమాచారం షేర్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ టూల్‌కిట్ కేవలం సమాచారానికి సంబంధించిందే, ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపించడానికి కాదని పేర్కొన్నారు. దిశ రవి కూడా ఇదే తరహా వాదన వినిపిస్తున్నారు.

English summary
The Delhi Police has reached out to video conferencing platform Zoom, seeking details of the alleged pro-Khalistan participants of an online meeting organised on 11 January, for the purpose of preparing a 'toolkit' supporting the farmers' protest, officials said on Tuesday, 16 February.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X