• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ వేరియంట్ టూల్‌కిట్ వివాదం -బీజేపీ చీఫ్ నడ్డా సహా నలుగురి ట్విటర్ ఖాతాల రద్దుకు కాంగ్రెస్ ఫిర్యాదు

|

కరోనా వైరస్ తనపని తాను చేసుకుంటూ వేలమందిని పొట్టన పెట్టుకుంటుడగా, రాజకీయ పార్టీలు సైతం వైరస్ చుట్టూ వాదులాటలు కొనసాగిస్తున్నాయి. దేశంలో కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో పూర్తిగా విఫలైన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు నేరుగానే తిట్టిపోస్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం మోదీ పరువు తీయడానికి ఏకంగా టూల్ కిట్ ను రూపొందించిందని బీజేపీ ఆరోపించింది. అయితే, సదరు ఆరోపణను అవాస్తవంగా పేర్కొన్న కాంగ్రస్.. తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ టాప్ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నది...

షాకింగ్: మోదీ వేరియంట్ కరోనా -ప్రధాని పరువుతీస్తూ కాంగ్రెస్ టూల్‌కిట్ -బీజేపీ సంచలన ఆరోపణలుషాకింగ్: మోదీ వేరియంట్ కరోనా -ప్రధాని పరువుతీస్తూ కాంగ్రెస్ టూల్‌కిట్ -బీజేపీ సంచలన ఆరోపణలు

కొవిడ్ పరిస్థితులను అవకాశంగా తీసుకుని కేంద్ర సర్కారుపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని, ప్రభుత్వ, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని, దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ధ్వంసరచనకు పాల్పడిందని ఆరోపించిన బీజేపీ.. కొవిడ్-19 మ్యూటెంట్‌ను ''ఇండియన్ స్ట్రెయిన్'', ''మోదీ స్ట్రెయిన్'' అని పిలవాలంటూ తన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ''టూల్‌కిట్'' ద్వారా సూచనలు ఇస్తోందని బీజేపీ ముఖ్యులు వరుసగా కొన్ని డాక్యుమెంట్లను బటయపెట్టారు. అయితే, సదరు డాక్యుమెంట్లను నకిలీవిగా కాంగ్రెస్ గుర్తించింది. ఆ మేరకు..

Toolkit row: Congress asks Twitter to suspend handles of BJPs Nadda, Irani, patra others

ట్విట్టర్ వేదికగా అధికార బీజేపీ టూల్‌కిట్ అంశాన్ని ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్లను సృష్టిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సంబిత్ పాత్రా, బి.ఎల్. సంతోశ్ ట్విట్టర్ ఖాతాలను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ట్విట్టర్‌కు ఓ లేఖ రాశామని కాంగ్రెస్ సోషల్ మీడియా నేత రోహన్ గుప్తా తెలిపారు.

అది బీజేపీ నకిలీ టూ‌ల్‌కిట్, నడ్డాపై కేసు -మోదీజీ.. అబద్ధాలు ఆపి జనం ప్రాణాలు కాపాడండి: కాంగ్రెస్ ఎదురుదాడిఅది బీజేపీ నకిలీ టూ‌ల్‌కిట్, నడ్డాపై కేసు -మోదీజీ.. అబద్ధాలు ఆపి జనం ప్రాణాలు కాపాడండి: కాంగ్రెస్ ఎదురుదాడి

  Arogya Sri వల్ల రోజూ 25000 మందికి Covid చికిత్స జరుగుతుంది - Ys Jagan || Oneindia Telugu

  ''నకిలీ పత్రాలను వ్యాప్తి చేయడంలో మునిగిపోయిన బీజేపీ నాయకుల ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము ట్విట్టర్ యాజమాన్యానికి అధికారికంగా లేఖ రాశాం. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ బుక్ అయ్యింది. స్వతంత్రులు కూడా బీజేపీ ప్రచారంలో మునిగిపోయారు. బీజేపీ నేతలు ట్విట్టర్‌ను తప్పుగా వినియోగిస్తున్నారు'' అని రోహన్ గుప్తా మండిపడ్డారు.

  English summary
  The Congress party on Thursday accused the BJP of spreading "forged documents" over the 'toolkit issue', and complained to Twitter seeking suspension of Twitter handles of BJP president JP Nadda, Union minister Smriti Irani, and BJP leaders Sambit Patra and BL Santosh. We've formally written to Twitter seeking suspension of Twitter accounts of BJP leaders who are indulging in spreading forged documents attributing to Congress
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X